మోడీ దెబ్బకు తెలంగాణకు సోనియా, రాహుల్: దేవినేని
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ దెబ్బకు, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దెబ్బకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు ఉత్తర భారత దేశంలో ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయాలనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు.
అధిష్టానం కనుసన్నల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డ్రామాను రక్తి కట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో శ్రీధర్ బాబు, సీమాంధ్రలో కిరణ్ చాంఫియన్ కావడానికి డ్రామా ఆడుతున్నారన్నారు. ఉత్తర భారతంలో ఎలాగూ ఓడిపోతామని భావిస్తుండటంతో, తెలంగాణను ఇచ్చి.. మెదక్‌లో సోనియా, కరీంనగర్‌లో రాహుల్ పోటీ చేసేందుకే సిద్ధమవుతున్నారన్నారు.

ముసాయిదా బిల్లు తెలుగు కాపీలు తమకు అందలేదని చెప్పారు. తెలంగాణ బిల్లులో 20 తప్పులు ఉన్నాయని, వెంటనే బిల్లును వెనక్కి పంపాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. బిల్లు వెనక్కి పంపాలని తీర్మానం చేయాల్సిందేనన్నారు. లొసుగులతో వచ్చిన బిల్లుపై చర్చ అంటే ఎలా అని ప్రశ్నించారు.
సభా సంప్రదాయాలు పాటించాలి: ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా సంప్రదాయాలను పాటించాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్ సూచించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఎన్ని తీర్మానాలు చేసినా అభ్యంతరం లేదన్నారు. తమ గడ్డ మీద దీక్ష చేసి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సిఎంపై గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications