రఘరామ గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తి అతనే..!!
రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తన గుండెల పై కూర్చొని దాడి చేసిన నిందితుడిని గుర్తించారు. గుంటూరులో జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పెరేడ్‌లో రఘురామ పాల్గొన్నారు. ఈ వివాదంలో తులసి బాబు గురించి రఘురామ కీలక వ్యాఖ్యలు చేసారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ వైసీపీ హయాంలో తన పైన కస్టోడియల్ టార్చర్ కేసు లో దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు. గుంటూరు జిల్లా కోర్టులో నిందితుడిని గుర్తించేందుకు పెరేడ్ నిర్వహించారు. ఇందులో నిందితుడిని గుర్తించినట్లు రఘురామ వెల్లడించారు. ఈ ఘటన అప్పట్లోనే జాతీయ స్థాయి లో సంచలనంగా మారింది. గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించినట్లు రఘురామ వెల్లడించారు. దాడి సమయంలో సెల్ ఫోన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతడి ముఖానికి ఉన్న ముసుగు తొలగడంతో దగ్గరగా చూసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడం ఏంటని రఘురామ ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో నర్సాపురం ఎంపీగా ఉన్నరఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు. అయితే, సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో చిత్రహింసలకు గురిచేసి, అంత మొందిం చే యత్నించినట్లు నమోదైన కేసులో వరుసగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రఘురామపై దాడి చేసిన కేసులో తులసిబాబు నిందితుడుగా ఉన్నారు.
కాగా, పరేడ్ ప్రక్రియ పూర్తైన తరువాత రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని చెప్పారు. తులసిబాబుకు కొందరు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని రఘురామ చెప్పుకొచ్చారు. అయితే.. తులసిబాబుకి, టీడీపీకి సంబంధం లేదని గుడివాడ వాసులు చెప్పారం టూ రఘురామ పేర్కొన్నారు. అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్‌నూ ప్రశ్నించాలని రఘురామ కోరారు.












Click it and Unblock the Notifications