శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్, స్టేషన్లు ఇలా..!!

అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది. ఇప్పటికే రెగ్యులర్ తో పాటుగా ప్రకటించిన అదనపు రైళ్లల్లో రిజర్వేషన్ పూర్తయి..భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో, ప్రత్యేక రైళ్ల ద్వారా కొంత మేర భక్తులకు సౌకర్యం కలగనుంది. ఈ నెల చివరి వారంతో పాటుగా డిసెంబర్ తొలి వారం లో ఈ రైళ్లను ప్రకటించారు. శబరి ఎక్స్ ప్రెస్ మార్గంలో ఈ రైళ్లు నడవనున్నాయి.

పెరుగుతున్న భక్తుల రద్దీ:శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను గుంటూరు, తెనాలి మీదగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గుంటూరు మీదగా ప్రయాణించే రైళ్లకు నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, చీరాలలోనూ నిలుపుదల ఉంది. తెనాలి మీదగా(మెయిన లైనలో) ప్రయాణించేవి బాపట్ల, చీరాలలో నిలుపుదల ఉంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి కొల్లం, నరసాపూర్‌ నుంచి కొట్టాయం, కాచిగూడ నుంచి కొల్లంకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతాయి. నెంబరు.07129 సికింద్రాబాద్‌ - కొల్లం రైలు ఈ నెల 26, డిసెంబరు 3(ఆదివారం) తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.15కి గుంటూరు, సోమవారం రాత్రి 11.55కి కొల్లం చేరుకొంటుంది. నెంబరు.07130 కొల్లం - సికింద్రాబాద్‌ రైలు ఈ నెల 28, డిసెంబరు 5 తేదీల్లో(మంగళవారం) వేకువజామున 2.30కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.40కి గుంటూరు, బుధవారం ఉదయం 8.55 సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Railway Announces special Trains for Sabarimala Devotees via Guntur

అదనపు రైళ్లు ఏర్పాటు:నెంబరు. 07119 నరసాపూర్‌ - కొట్టాయం రైలు నవంబరు 26, డిసెంబరు 3 తేదీల్లో(ఆదివారం) మధ్యాహ్నం 3.50కి బయలుదేరి రాత్రి 7.49కి తెనాలి సోమవారం సాయంత్రం 4.50కి కొట్టాయం చేరుకొంటుంది. నెంబరు.07120 కొట్టాయం - నరసాపూర్‌ రైలు ఈ నెల 27, డిసెంబరు 4 తేదీల్లో(సోమవారం) రాత్రి 7 గంటలకు బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.20కి తెనాలి, రాత్రి 9 గంటలకు నరసాపూర్‌ చేరుకొంటుంది. నెంబరు.07125 కాకినాడ టౌన - కొట్టాయం రైలు నవంబరు 23, 30 తేదీల్లో(గురువారం) సాయంత్రం 5.40కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.05కి తెనాలి, శుక్రవారం రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకొంటుంది. నెంబరు.07126 కొట్టాయం - కాకినాడ టౌన నవంబరు 25, డిసెంబరు 2(శనివారం) ప్రారంభ గడియల్లో 12.30కి బయలుదేరి రాత్రి 7.50కి తెనాలి, ఆదివారం వేకువజామున 4 గంటలకు కాకినాడ టౌనకు చేరుకుంటుంది.

ప్రయాణ సమయాల ప్రకటన:నెంబరు.07123 కాచీగూడ - కొల్లం రైలు ఈ నెల 22, 29, డిసెంబరు 3 తేదీల్లో(బుధవారం) సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11.30కి గుంటూరు, గురువారం రాత్రి 11.55కి కొల్లం చేరుకొంటుంది. నెంబరు.07124 కొల్లం - కాచీగూడ రైలు నవంబరు 24, డిసెంబరు 1, 8 తేదీల్లో(శుక్రవారం) వేకువజామునకు ముందు 2.30కి బయలుదేరి శనివారం వేకువజామున 3.05కి గుంటూరు, ఉదయం 10.30కి కాచిగూడ చేరుకుంటుంది. నెంబరు.07022 గుంటూరు - జైపూరు ప్రత్యేక రైలు ఈ నెల 22న బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి విజయవాడ, నాగ్‌పూర్‌, ఉజ్జయిని మార్గంలో ప్రయాణించి శుక్రవారం ఉదయం 6.30కి జైపూరు చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+