ఏపీకి వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్: రూట్ ఇదే

Vande Bharat Metro: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

Railway authorities is planning to launch the first Vande Metro

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో అవి రూపుదిద్దుకుంటోన్నాయి. త్వరలోనే అవి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.

అదే సమయంలో వందే భారత్ మెట్రో రైళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి కసరత్తు పూర్తయింది. చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో వందే మెట్రో రైల్ బోగీలు సిద్ధం అయ్యాయి. జులైలో ఇవి పట్టాలెక్కనున్నాయి. మొట్టమొదటి వందే మెట్రో రైలును ఏపీకి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆధ్యాత్మిక నగరి తిరుపతి నుంచి చెన్నై మధ్య మొట్టమొదటి వందే మెట్రో రైలును నడిపించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. జులైలో ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు వారాల ట్రయల్ రన్ తరువాత ప్రయాణికుల కోసం అందుబాటులకి తీసుకొస్తారు.

తిరుపతి- చెన్నైతో పాటు ఢిల్లీ-రెవారీ, భువనేశ్వర్- బాలాసోర్, లక్నో- కాన్పూర్, ఆగ్రా- మథుర మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉండే నగరాల మధ్య ఈ రైళ్లను నడిపించాలని రైల్వే అధికారులు ప్రతిపాదించారు.

12 కోచ్‌లో వందే మెట్రో రూపుదిద్దుకుంది చెన్నై ఆర్సీఎఫ్‌లో. క్రమంగా ఈ సంఖ్యను 16 కోచ్‌లకు పెంచుతారు. నగరాలను ఇంటర్ లింక్ చేస్తూ ఈ వందే మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటి స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం వీటి ముఖ్య ఉద్దేశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+