తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైల్వే లైన్, నాలుగు గంటల్లోనే - గ్రీన్ సిగ్నల్..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ రాసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రెండు లైన్లను ఎంపిక చేసారు. తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ కోచ్ వందేభారత్ ను ప్రవేశ పెట్టనున్నారు.

సూపర్ ఫాస్ట్ లైన్ దిశగా:తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ఈ నెలాఖరులో సికింద్రాబాద్ - నాగపూర్ వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి బెంగుళూరు, భువనేశ్వర్, పూణేకు కొత్త వందేభారత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త హైస్పీడ్ కారిడార్ సర్వే అంశంలోనూ ఈ ప్రతిపాదన చేసారు. ఈ హైస్పీడ్ లైన్ సర్వే పూర్తయితే..220 కిలో మీటర్ల సామర్ధ్యంతో నూతన కారిడార్లను నిర్మించనున్నారు. దీని ద్వారా 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ కోచ్ లో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.

Railway board green signal for Survery on Super fast railway lines in both Telugu states

నాలుగు గంటల్లోనే విశాఖకు:తెలుగు రాష్ట్రాల్లో సూపర్‌ఫాస్ట్‌ రైల్వే ప్రాజెక్టు పై కీలక నిర్ణయం జరిగింది. ప్రతిపాదిత శంషాబాద్ - విజయవాడ- విశాఖపట్నం, అదే విధంగా కర్నూలు- విజయవాడ సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రక్రియ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది. ఇవి కార్యరూపం దాలిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. నాలుగు గంటల్లోనే విశాఖకు చేరుకొనే వెసులు బాటు కలుగుతుంది. ఈ రెండు లైన్ల పరిధిలో మొత్తం 942 కి.మీ మార్గంలో గరిష్ఠంగా 220 కిమీ వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు.

వందేభారత్ స్లీపర్ కోచ్ :తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే రూట్ల సామర్ధ్యం ప్రస్తుతం 110 నుంచి 150 కిలో మీటర్ల లోపే ఉంది. శంషాబాద్ - విజయవాడ- విశాఖ, అదే విధంగా కర్నూలు- విజయవాడ మధ్య గంటకు 220 కిలో మీటర్ల వేగంతో రైళ్లను నడిపేందుకు కొత్త మార్గాలను సిద్దం చేయాలనేది రైల్వే శాఖ ఆలోచన. ఇందుకు ఈ మార్గాల్లో ఏయే ప్రాంతాల మీదుగా ఎలైన్ మెంట్ చేయాలనే అంశం పైన ఇప్పటికే గుత్తేదారులను ఎంపిక చేసింది. ఆరు నెలల్లో గుత్తేదారు నివేదిక ఇవ్వనున్నారు. ఈ లైన్ కు ఆమోదం పొందింతే హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ కోచ్ వందేభారత్ రైళ్లను అందుబాటులో కి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+