Cyclone Montha: విశాఖ మీదుగా మూడు రోజులు ఈ 43 రైళ్లు రద్దు, దారి మల్లింపు..!!

తుఫాను ప్రభావం ఏపీలో మొదలైంది. పలు జిల్లాలను వణికిస్తోంది. మూడు రోజుల పాటు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థ పైనా పడింది. విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 43 రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేసారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు. ఇక.. కోస్తా తీరం తుఫాను అలర్ట్ తో అప్రమత్తం అయింది.

మొంథా తుపాను ప్రభావం క్రమేణా తీవ్రంగా మారుతోంది. అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. రేపు (మంగళవారం) తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. రవాణా వ్యవస్థ పైన ప్రభావం పడుతోంది.

railway-cancels-43-trains-due-to-cyclone-montha-in-visakha-sections-for-three-days

విశాఖ నుంచి నిత్యం ప్రధాన కేంద్రాలకు రాక పోకలు సాగించే 43 రైళ్లను మూడు రోజులు రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. తుఫాను తీవ్రతను చూసిన తరువాత సర్వీసులను పునరుద్దరిస్తామని స్పష్టం చేసారు. కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటనుండటంతో... ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటే... పరిస్థితులకు అనుగుణంగా రద్దు.. దారి మళ్లింపు నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. అటు ఇప్పటికే కాకినాడ తీరంలో అలజడి మొదలైంది. సాయంత్రం నుంచి కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్ రేపు కాకినాడ వద్ద తీరం దాటనుంది.

ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+