ఏపీ నుంచి బెంగళూరు కు వందేభారత్ - రూట్ ఫిక్స్..!!

ఏపీ నుంచి త్వరలో మరో కొత్త వందేభారత్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రారంభించిన వందేభారత్ రైళ్లతో మరిన్ని మార్గాల్లో ప్రారంభానికి డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందేభారత్ ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూట్ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం పైన అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.

విజయవాడ టు బెంగళూరు
వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. విశాఖ - సికింద్రాబాద్ అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపిస్తోంది. ఇక, విజయవాడ నుంచి చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు కొత్త సర్వీసు కావాలనే డిమాండ్ పెడింగ్ లో ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ కు ఆక్యెపెన్సీ రేషియో పెరుగుతోంది. అయితే, ఏపీ నుంచి బెంగళూరుకు కొత్త వందేభారత్ పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి.

Railway likely to launch new Vandebharat from Guntur to Banglore as latest proposals

తాజా చర్చలతో
తాజాగా, టీడీపీ లోక్ సభ పార్టీ నేత..ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు రైల్వే మంత్రితో ఈ లైన్ లో ప్రతిపాదన పైన మరోసారి చర్చించారు. ఇప్పటికే రూట్ .. అవసరాలు.. డిమాండ్ పైన వివరంగా నివేదిక ఇచ్చిన ఎంపీ... తాజాగా పార్లమెంట్ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుంటూరు నుంచి బెంగళూరుకు ప్రస్తుతం రైల్వే ప్రయాణం ఆశించిన స్థాయిలో లేదని.. ప్రయాణీకుల ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుంటూరు నుంచి బెంగళూరు కు దాదాపు 16 గంటల సమయం తీసుకుంటోందని వివరించారు. దీంతో, ఈ రూట్ లో వందేభారత్ అసవరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన పైన రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.

రూటు ఖరారు
కాగా, ఇప్పటికే రైల్వే అధికారులు సైతం ఈ రైలు ఏ మార్గంలో నడపాలనే దాని పైన ప్రాధమికంగా నివేదిక సిద్దం చేసారు. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం మీదుగా నంద్యాల, డోన్, గుంత కల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకలో స్టాపులు ఉండేలా ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గం లో కొత్తగా వందేభారత్ నడిపేందుకు సాంకేతిక అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. వీటిని పరిశీలించిన తరువాత ఈ నెలాఖరులో లోగా వందేభారత్ కొత్త రైలు పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+