Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ కి రైల్వే మంత్రి ఫోన్! దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

విజయవాడ: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ క్రమంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

railway minister ashwini vaishnaw phone call to ap cm ys jagan on rail accident incident

సీఎం జగన్‌కు కేంద్ర రైల్వే మంత్రి ఫోన్‌

విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్‌ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యన్నారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్‌, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.

ఏపీ సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన

రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించాలన్నారు. అలాగే మరణించన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారికి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగివుంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖపట్నం-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది.

రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం అందడంతో ఇప్పటికే సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాయని డీఆర్ఎం తెలిపారు.

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. పలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఇది సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగిస్తోంది. ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు.

హెల్ప్ లైన్ నెంబర్లు:

రైలు ప్రమాదం నేపథ్యంలో అధికారులు హెల్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+