రైలు ప్రయాణీకులకు అందుబాటులో అత్యవసర చికిత్స - ఆక్సిజన్..!!
రైలు ప్రయాణీకులకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసుపై రైల్వే శాఖ మంత్రి కీలక ప్రకటన చేసారు.
రైలు ప్రయాణీకులకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసుపై రైల్వే శాఖ మంత్రి కీలక ప్రకటన చేసారు. రైలు ప్రయాణీకులకు అత్యవసర సమయాల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని రైళ్లు..రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో పాటుగా మెడికల్ సామాగ్రి...ఆక్సిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బందిని సిద్దం చేస్తున్నామని చెప్పారు.
రైలు ప్రయాణీకులకు అత్యవసర సమయాల్లో వైద్య సాయం అందించేందుకు సేవలను మెరుగు పరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రాధమిక చికిత్స చేసేలా ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్యాసింజర ట్రయిన్స్ తో పాటుగా రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని అందిన సిఫార్సుల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్‌లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం అందిచే విధంగా రిజర్వేషన్ సమయంలోనే పూర్తి వివరాలతో సిద్దం అవుతున్నారని వివరించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు రైల్వే మంత్రి తన సమాధానంలో స్పష్టం చేసారు. గతంలోనూ ఈ తరహా సేవలు ఉన్నా.. వాటిని మరింత ఆధునీకరించి..తక్షణం సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications