విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ సమయాల్లో మార్పు..!!

వందేభారత్ రైలు వేళల్లో మార్పులు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైలే ప్రయాణీకుకు రైల్వే అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. కొద్ది రోజులుగా విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు నిత్యం గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. అంచనాలకు మించిన ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలు ఈ రోజు (శనివారం) రీ షెడ్యూల్ చేసారు. సాంకేతిక సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. దీంతో, సోషల్ మీడియా వేదికగా ప్రయాణీకులు నిలదీస్తున్నారు.

గంటల తరబడి ఆలస్యం:గత కొద్ది రోజులుగా వందేభారత్ గంటల మేర ఆలస్యంగా నడుస్తోంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ మూడు గంటల వరకు ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. అదే విధంగా తిరిగి సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుకొనే వందేభారత్ అర్ద్రరాత్రి తరువా విశాఖకు చేరుకుంటోంది.

Railway officials Announced Re Scheduling of Visakha - Seunderabad Vandebharat on 17th june

దీని పైన ప్రయాణీకుల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే సౌకర్యవంతంగా..వేగంగా గమ్యస్థానాల కు చేరుకొనేందకు ధరలు ఎక్కువైనా వందేభారత్ కు ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు. ఇక, ఈ రోజు (శనివారం) కూడా వందేభారత్ ఆలస్యంగా నడుస్తుందని అధికారులు ప్రకటించారు. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లై వందే భారత్‌ రైలు ఉదయం 5.45 గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.

పని చేయని ఏసీలు..ఉక్కిరి బిక్కిరి:అదే విధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ ప్రతీ రోజు మధ్నాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రోజు (శనివారం) అయిదు గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అర్ద్రరాత్రి తరువాత విశాఖ చేరుకోనుంది.

ఆదివారం ఈ రైలు ఉండదు. శుక్రవారం విశాఖ - సికింద్రాబాద్‌ వందేభారత్ లో తలెత్తిన సాకేంతిక సమస్య కారనంగా మూడున్నార గంటలు రైలు నిలిచిపోయింది. అప్పటికే అయిదు గంటలు ఆలస్యంగా బయల్దేరిన రైలులో నాలుగు బోగీలలో ఏసీలు పనిచేయలేదు. ప్రయాణీకులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ రైలులో సాధారణ కిటికీలకు అవకాశం లేకపోవటంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పలేదు.

ప్రయాణీకుల అసహనం:మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న తరువాత రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించారు. మూడు గంటలకు పైగా శ్రమించిన తరువాత సమస్య పరిష్కారం అయింది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు రైలు విజయవాడ నుంచి బయల్దేరింది. దాదాపు 8 గంటలు ఆలస్యంగా రైలు నడిచింది.

అనకాపల్లి-తాడి సెక్షన్‌ మధ్యలో ట్రాక్‌ నిర్వహణ కారణంగా ఈ రోజున రైల్లే అధికారులు పలు రైళ్లను రద్దు చేసారు. వందేభారత్ నిత్యం గంటల తరబడి ఆలస్యం..సాంకేతిక సమస్యల పైన ప్రయాణీకులు అధికారులను నిలదీస్తున్నారు. ఇన్ని గంటలు ఆలస్యంగా నడుస్తున్న రైళ్లకు తాము రిజర్వ్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ..పూర్తి రిఫండ్ ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+