విశాఖకు వెళ్లే ప్రధాన రైళ్ల కుదింపు, స్పెషల్స్ పొడిగింపు..!!

రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. వేసవి రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. డిమాండ్ కు అనుగుణంగా ఈ రైళ్లను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొనసాగించే సర్వీసుల వివరాలను రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక, మరో వైపు విశాఖ పరిధిలో పలు మరమ్మత్తుల కారణంగా ఈ సెక్షన్ లో పలు రైళ్లను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

విశాఖలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ల గడువు పొడిగించినట్టు వాల్తేర్‌ డివిజన్ అధికారులు ప్రకటించారు. విశాఖ - తిరుపతి (08547) రైలు జూన్‌ 4వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖలో బయలుదేరి ఆ మరు సటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి - విశాఖ (08548) రైలు జూన్‌ 5వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖకు వస్తుంది. విశాఖ- చర్లపల్లి రైలు జూన్‌ 6వ తేదీ నుంచి జులై 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.20 గంటలకు చర్లపల్లికి వెళ్తుంది.

railway-officials-announces-special-trains-for-visakha-extended-details-here

అదే విధంగా చర్లపల్లి - విశాఖ రైలు జూన్‌ 7వ తేదీ నుంచి జులై 26వ తేదీ వరకు ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఆదివారం ఉదయం 8 గంటలకు విశాఖ చేరుతుంది. కాగా, వాల్తేర్‌ డివిజన్‌లోని కేకే లైన్‌లో చేపడుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్ల గమ్యస్థానాలు తగ్గించారు. ఈ నెల 26, జూన్‌ 2, 9వ తేదీల్లో విశాఖ - కిరండూల్‌ - విశాఖ (58501- 58502) రైళ్లు కొరాపుట్‌ వరకు రాకపోకలు సాగిస్తాయి.
ఈ నెల 25, జూన్‌ 1, 8 తేదీల్లో భువనేశ్వర్‌ - జగదల్‌పూర్‌ (18447), రూర్కెలా- జగదల్‌పూర్‌ (18107) వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈనెల 26, జూన్‌ 2, 9వ తేదీల్లో జగదల్‌పూర్‌- భువనేశ్వర్‌ (18448), జగదల్‌పూర్‌- రూర్కెలా (18108) రైళ్లు కొరాపుట్‌ వరకు రాకపోకలు సాగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+