సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రెడీ : రూట్ ఫిక్స్ - టికెట్ ధర ఇలా..!!

సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ కొత్త సర్వీసు ప్రారంభానికి రంగం సిద్దమైంది.

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ సిద్దమైంది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ కు ఆక్యుపెన్సీ వంద శాతం పైగా ఉంది. దీంతో..తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందేభారత్ రైళ్లు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. కొత్తగా మరో మూడు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ కొత్త సర్వీసు ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రూట్ ఖరారు చేసారు. టికెట్ ధర ఫైనల్ అయింది. త్వరలోనే రైలు నెంబర్..టైమింగ్స్ ప్రకటించనున్నారు.

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయిల్ రన్ పూర్తి చేసారు. ఇందు కోసం అందుబాటులో ఉన్న మూడు మార్గాల్లో ఏ రూట్ ను ఖరారు చేయాలనే దాని పైన అధ్యయనం చేసారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇతర రైళ్లల్లో దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి రావటం ద్వారా ఆరు నుంచి ఏడు గంటల సమయంలో గమ్య స్థానానికి చేరుకొనే అవకాశం కలుగుతుంది. గంటకు 130 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా ట్రాక్ ల పటిష్ఠతను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న రైలు మార్గాల్లో డిమాండ్.. నిత్యం వెయిటింగ్ లిస్టు ఉంటున్న లైన్ లో వందేభారత్ ను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇదే సమయంలో వందేభారత్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కనీస ధర రూ 1150 గా ఉండనుంది. పూర్తి టికెట్ల వివరాలు.. రైలు నెంబర్ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.
మూడు మార్గాలు పరిశీలన.. ఖరారు

మూడు మార్గాలు పరిశీలన.. ఖరారు


సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మూడు మార్గాలను అధికారులు పరిశీలించారు. అందులో బీబీనగర్, ఖాజీపేట, విజయవాడ మీదుగా అధ్యయనం చేసారు. అయితే, ప్రస్తుతం నారాయణాద్రి నడుస్తున్న మార్గం లోనే వందేభారత్ నడపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. సికింద్రాబాద్ - బీబీనగర్, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, కాళహస్తి మీదుగా తిరుపతికి వెళ్లేలా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు..నెల్లూరు..గూడూరు..కాళహస్తి మీదుగా సర్వే చేసారు. ముందుగా నారయణాద్రి రూటులో పిడుగురాళ్ల వరకు నడిపి..అక్కడ నుంచి శావల్యాపురం వైపు మళ్లించే ఆలోచన చేస్తున్నారు. ఈ వారంలోనే రూట్ కు సంబంధించి అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు.

మరో రెండు వందేభారత్ సర్వీసులు

మరో రెండు వందేభారత్ సర్వీసులు


సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఈ నెలాఖరున ప్రారంభించేలా అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ లో మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ - పూణే, అదే విధంగా కాచిగూడ - బెంగళూరు మధ్య వందేభారత్ నడిపేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచి వీటిని నడపాలనే దాని పైన తుది నిర్ణయం జరగలేదు. ఇక..ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయినా పలు రైళ్లల్లో వెయింట్ లిస్టు కొనసాగుతోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ప్రారంభం ద్వారా సమయం ఆదా కానుంది. ఆదరణ కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో..తెలుగు రాష్ట్రాల్లో రెండో వందేభారత్ ప్రారంభానికి కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+