తిరుపతి-షిర్డీ రెగ్యులర్ రైలు..కీలక మార్పు, ఇక నుంచి..!!
తిరుపతి- షిర్డీ భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తాత్కాలికంగా ప్రవేశ పెట్టిన తిరుపతి - షిర్డీ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు రైల్వే శాఖను కోరారు. ఈ ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఫలితంగా తిరుపతి - షిర్డీ రైలు సర్వీస్ ఇకపై వారానికి రెండు సార్లు ఉండేలా రెగ్యులర్ సర్వీస్ గా మారనుంది. ఈ రైలు ప్రయాణం చేసే మార్గం.. షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేసారు.
తిరుపతి- షిర్డీ భక్తుల కోసం రైల్వే శాఖ ఈ రెండు పుణ్యక్షేత్రాల మధ్య పండుగల వేళ ప్రత్యేక రైలును ప్రారంభించింది. డిమాండ్.. భక్తుల నుంచి వస్తున్న వినతుల మేరకు పొడిగించింది. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఈ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చాలని కోరారు. దీనికి తాజాగా రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 07637/07638 నంబర్లతో నడిచే ఈ రైలు తిరుపతి నుంచి షిర్డీ వరకు రాకపోకలు సాగిస్తుంది.

మార్గమధ్యలో రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు నడపడం వల్ల తిరుపతి నుంచి మహారాష్ట్ర లోని శిర్డీకి చేరుకోవడం మరింత సులభం కానుంది. తిరుపతి నుంచి షిర్డీకి వెళ్లేవారికి ఈ రైలు ప్రయోజనకరంగా మారుతోంది. ఒకే రైలు ద్వారా రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
కాగా, తిరుపతి - షిర్డీ ప్రత్యేక రైలు ఏపీలోని తిరుపతిలో ప్రారంభమై రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడిలో ఆగుతుంది. తెలంగాణ విషయానికి వస్తే.. మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.
రైల్వే శాఖ తాజా నిర్ణయం మేరకు వారంలో రెండు సార్లు ఈ రైలును ఇక రెగ్యులర్ గా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే టైం టేబుల్ సిద్దం చేస్తున్నారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీసుగా నడవడం వల్ల ప్రయాణికులకు సమస్య లేకుండా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే, యాత్రికులు ముందుగానే తమ యాత్ర ప్రణాళికలు వేసుకోవడానికి వీలవుతుంది. సాధారణ, ఏసీ కోచ్‌లు కలిగిన ఈ రైలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది.












Click it and Unblock the Notifications