సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రూట్ ఫైనల్ : ప్రత్యేక గుర్తింపు..!!

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి రూట్ ను అధికారులు ఖరారు చేసారు.

వందేభారత్ కు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. అధిక టికెట్ ధరల పైన విమర్శలు ఉన్నా.. సౌకర్యాలు - సమయ ఆదా విషయంలో ప్రయాణీకులు వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య వందేభారత్ నడుస్తోంది. త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి రూట్ ను అధికారులు ఖరారు చేసారు. వందేభారత్ కు సంబంధించి ఏపీ మరో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఏపీ కేంద్రంగా వందేభారత్ విడిభాగాల తయారీ కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సిద్దం..

తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సిద్దం..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలో మూడు వందేభారత్ రైళ్ల కు గ్రీన్ సిగ్నల్ లభించింది. సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ- బెంగుళూరు, సికింద్రాబాద్ - పూణే మధ్య ఈ మూడు కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ - తిరుపతి రైలుకు సంబంధించి ట్రయిల్ రన్ పూర్తి చేసారు. ఈ రూటు లో తిరుపతికి పలు రైళ్లు నడుస్తున్నాయి. అయినా డిమాండ్ తగ్గటం లేదు. నిత్యం వెయిటింట్ లిస్టు భారీగా ఉంటుంది. దీంతో.. ఏ రూట్ లో వందేభారత్ నడపాలనే దాని పైన అధికారులు కసరత్తు చేసారు. సుదీర్ఘ కసరత్తు.. ఎక్కవ మందికి ప్రయోజనం కలిగేలా నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా తాజాగా సికింద్రబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడిపే రూట్ ను అధికారులు ఖరారు చేసారు.
ఈ రూట్ అయితే ప్రయోజనకరమంటూ..

ఈ రూట్ అయితే ప్రయోజనకరమంటూ..


సికింద్రాబాద్ నుంచి విజయవాడ పెద్ద సంఖ్యలో రైళ్లు తిరుపతికి నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - నల్గొండ- గుంటూరు మీదుగా తిరుపతికి ఒక్క రైలు మాత్రమే ఉంది. అన్ని రైళ్లు తెనాలి నుంచి కామన్ గా తిరుపతికి ఒకే రూట్ లో వెళ్తాయి. దీంతో.. ప్రస్తుతం నారాయణాద్రి రైలు నడుస్తున్న రూట్ లోనే కొత్తగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ నడపాలని అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ - బీబీనర్ - నల్గొండ- మిర్యాలగూడ- నడికూడి- సత్తెనపల్లి- గుంటూరు మీదుగా తెనాలి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఒంగోలు - నెల్లూరు మీదుగా రేణిగుంట నుంచి తిరుపతి చేరుకోనుంది. ప్రస్తుతం నారాయణాద్రి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 12.30 గంటల సమయం తీసుకుంటుంది. ఇప్పుడు వందేభారత్ కు దాదాపు రెండు గంటల వరకు సమయం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం నిర్మాణంలో పిడుగురాళ్ల - శావల్యపురం లైన్ పూర్తయితే ఆ లైన్ నుంచి దారి మళ్లించనున్నారు. దీని ద్వారా మరింత సమయం కలిసి వచ్చే అవకాశం ఉంది.

శ్రీసిటీలో వందేభారత్ రైలు విడిభాగాల తయారీ

శ్రీసిటీలో వందేభారత్ రైలు విడిభాగాల తయారీ


వందేభారత్ కు సంబంధించి ఏపీకి మరో ప్రత్యేకత ఉంది. శ్రీసిటీ లో వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు విడిభాగాలు బీఎఫ్జీ ఇండియా పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్నాయి. వందేభారత్ రైలులోని ఇంటీరియన్, టాయిలెట్ క్యాబిన్, ఇంజిన్ ముందుబాగాలను బీఎఫ్ జీ సంస్థ సరఫరా చేస్తోంది. ఒక్కో రైలు కోసం 329 రకాల ఫైబరల్ రీ ఇన్ ఫోర్డ్స్ ప్లాస్టిక్ ప్యానెళ్లను తయారు చేసింది. ఇచ్చిన పనులను రికార్డు స్థాయిలో పది నెలల్లోనే పూర్తి చేసింది. ఢిల్లీ మెట్రో రోలింగ్ స్టాక్ కోసం బొంబార్డియర్ ట్రాన్స పోర్టేషన్ లో దాని వ్యూహాత్మక సరఫరాదారుగా ఉంటూ డ్రైవరల్ క్యాబ్ లతో పాటుగా ఎఫ్ఆర్పీ విడిభాగాలను సైతం బీఎఫ్ జీ ఇండియా తయారు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+