రైల్వే ప్రయాణీకులకు ఇక ఆన్ లైన్ ఫుడ్ - నేరుగా బెర్తు వద్దకే..!!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు దూరపు ప్రయాణాలు చేసే వారికి ఇక కోరుకున్న రుచులను జర్నీలోనే ఆస్వాదించే అవకాశం కలుగుతోంది. ప్రయాణీకుల కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా మరో వెసులుబాటు కలిగించింది. ఇకపై రైల్వే ప్రయాణికులు జొమాటో యాప్‌ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా ప్రయాణీకులు ఇక తమకు నచ్చిన హోటల్ నుంచి కోరుకున్న ఫుడ్ నేరుగా తమ బెర్తు వద్దే పొందే అవకాశం ఏర్పడింది.

ప్రయాణీకుల కోసం తాజాగా
రైల్వే ప్రయాణీకులకు కొత్తగా మరో సౌకర్యం అందుబాటులోకివచ్చింది. ఇప్పటి వరకు దూర ప్రయాణాల్లో రైళ్లల్లో అందుబాటులో ఉన్న పాంట్యీలో తయరు చేసే ఫుడ ను మాత్రమే తీసుకోవాల్సి వచ్చేంది. లేక. ప్రయాణీకులు తాము సొంతంగా సిద్దం చేసుకున్న ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం..స్టేషన్లలో ఉన్న క్యాంటీన్లతోన ఫుడ్ మాత్రమే పొందేవారు. అయితే, ఆన్ లైన్ ఫుడ్ సేవలకు పెరుగుతున్న ప్రాధాన్యతతో రైళ్ల ప్రయాణీకులకు దూరం ప్రయాణించే రైళ్లల్లో అందుబాటులోకి తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. రైళ్లల్లో ప్రయాణీకులకు సేవల విషయంలో ఐఆర్‌సీటీసీ టైర్ ప్యాకేజీల నుంచి ఫుడ్ నిర్వహణ వరకు బాధ్యతలు నిర్వహిస్తోంది.

Railway Passengers can order food and get Zomato delivery at preferred station

జొమాటోతో ఒప్పందం
ఇప్పుడు, తాజాగా ముఖ్య నిర్ణయం తీసుకుంది. జొమాటాతో ఒప్పందం చేసుకుంది. ప్రయాణికులు ముందుగా ఆర్డర్‌ చేసుకున్న ఫుడ్‌ను నేరుగా సీటు వద్దకు తెప్పించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇందుకోసం జొమాటోతా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సేవలను ఎంపిక చేసిన 5 స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తర్వలోనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లకు జొమాటో సేవలను విస్తరించాలని చూస్తున్నారు. ఈ-క్యాటరింగ్ సేవల కింద ప్రయాణికులకు ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్న ఇప్పుడు ఆన్ లైన్ సేవల ద్వారా బెర్తు వద్దకే కోరుకున్న చోట నుంచి కోరుకున్న ఫుడ్ పొందే అవకాశం ఏర్పడుతోంది. ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ కింద ప్రస్తుతం న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌, లఖ్‌నవూ, వారణాసి రైల్వే స్టేషన్లలో సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Railway Passengers can order food and get Zomato delivery at preferred station

నేరుగా బెర్తు వద్దకే కోరుకున్న ఫుడ్
ఐఆర్‌సీటీసీ ఇప్పటికే పండగ సీజన్‌ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేసే వారి కోసం ప్రత్యేక థాలీని అందిస్తోంది. ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత జొమాటో షేర్‌ 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నాలుగు స్టేషన్లలో అమలు చేస్తున్న ఈ ఆన్ లైన్ విధానం పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో విస్తరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఆన్ లైన్ ఫుడ్ సేవలను నేరుగా బెర్తు వద్దకు అనుమతించటం ప్రయాణీకులకు వెసులుబాటు కలిగించే నిర్ణయంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+