తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయి..!!
వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ కనిపిస్తోంది. ఇతర రైళ్ల కంటే వీటికి ప్రాధాన్యత పెరుగుతోంది. వందేభారత్ లో ఇప్పటి వరకు ఛైర్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ తో స్లీపర్ కోచ్ లను ప్రవేశ పెట్టేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రత్యేక సదుపాయాలతో కోచ్ లు సిద్దం చేసారు. వీటిని పట్టాలెక్కించేదుకు ముహూర్తాన్ని అధికారులు ఖరారు చేసారు.
వందేభారత్ స్లీపర్: వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకుకేవలం ఉదయం మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. టికెట్ ధరలు ఎక్కువగా ఉంటున్నా..ఇతర రైళ్ల కంటే వేగంగా సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుతుండటంతో ప్రయాణీకులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

దీంతో, దూరం మార్గాల్లో స్లీపర్ కోచ్ లతో కొత్త రైళ్లను ప్రవేశ పెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మార్చి - ఏప్రిల్ నుంచి భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలి వందే భారత్ స్లీపర్ రైలును దిల్లీ-ముంబయిల మధ్య ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక సదుపాయాలతో: తొలి దశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. వీటిని ప్రవేశ పెట్టటం ద్వారా ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లల్లో 16 నుంచి 20 (ఏసీ, నాన్-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. వీటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేశారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలు ఆదా అవుతుంది. త్వరలోనే వందే మెట్రో రైలును కూడా తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో: తాజాగా కేంద్ర బడ్జెట్ లోనూ దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వందేభారత్ స్లీపర్ రైళ్లల్లో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి నడిపేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నారు. సికింద్రాబాద్ - పూణే మార్గంలో ఒక సర్వీసును ప్రతిపాదించారు.
అదే విధంగా విశాఖ - భువనేశ్వర్ మధ్య రెండో వందేభారత్ స్లీపర్ ను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు మార్గాల పైన అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రైళ్ల అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications