Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతి రిటర్న్ జర్నీ ప్రయాణీకుల కోసం రైల్వే కీలక ప్రకటన, నో టెన్షన్..!!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు సొంత ఊర్లకు వెళ్లారు. తమ వారితో పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి రద్దీ కోసం రైల్వే.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసాయి. ప్రయివేటు బస్సులు అధిక రేట్లు వసూలు చేసాయి. కాగా, ఇక ఈ నెల 18వ తేదీకి రిటర్న్ జర్నీ కోసం చాలా మంది ప్రధాన రైళ్లల్లో రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే, భారీగా వెయిటింగ్ లిస్టు ఉంది. దీంతో, రిజర్వేషన్ ఖరారు కాని వారి కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.

సంక్రాంతికి గత అయిదు రోజులుగా రైళ్లు.. బస్సులు అన్ని ఫుల్ అయ్యాయి. ప్రత్యేక సర్వీసులు రిజర్వ్ అయ్యాయి. ప్రయివేటు వాహనాలు దాదాపు నాలుగు రోజుల సమయంలో హైదరాబాద్ - విజయవాడ మధ్య నాలుగు లక్షల వరకు ప్రయాణం చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే రైల్వే శాఖ పండుగకు సొంత ఊర్లకు వెళ్లిన వారికి రిటర్న్ జర్నీ కోసం పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, ప్రత్యేక రైళ్లల్లోనూ రద్దీ కొనసాగుతోంది.

Railways announces special trains for Sankranti rerun journeys route and Schedule here

వెయిటింగ్ లిస్టు ఎక్కువ ఉన్న మార్గాల్లో రైల్వే శాఖ తాజాగా జన సాధారణ్ రైళ్లను ప్రకటించింది. పండుగ ప్రయాణికులతో గోదావరి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గరీబ్‌రథ్‌, కోణార్క్‌, ఫలక్‌నూమా, ఎల్‌టీటీ, కోరమాండల్‌, మెయిల్‌, టాటా-ఎర్నాకులం, బొకారో వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. దీంతో.. ప్రయాణికుల వినతి మేరకు విశాఖ, విజయవాడ మధ్య జనసాధారణ్‌ (అన్ని జనరల్‌ కోచ్‌లతో) ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు.

08567 నంబరు గల ప్రత్యేక జనసాధారణ్‌ రైలు 16, 17, 18న ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08568 నంబరు గల ప్రత్యేక రైలు 16, 17, 18న సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో బయలుదేరి అర్ధరాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుతుంది. రిజర్వేషన్ లేకపోయినా అప్పటికి అప్పుడు ఈ రైలులో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అన్నీ సాధారణ కోచ్ లే ఉంటాయి.

గత ఏడాది సంక్రాంతి సమయంలోనూ ఇదే విధంగా జన సాధారణ్ రైళ్లు ఏర్పాటు చేసినా.. అవగాహన లేక ఈ రైళ్లు ఖాళీగా తిరిగాయి. దీంతో.. ఈ సారి జనసాధారణ్ రైళ్ల పైన రైల్వే శాఖ ప్రత్యేకంగా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న విశాఖ - విజయవాడ మార్గంలో వీటిని నడపనున్నారు. అదే విధంగా విశాఖ- పార్వతీపురం (08656/66) మధ్య జనసాధారణ్ రైళ్లు ప్రకటించారు. రిజర్వేషన్ ఖరారు కాని ప్రయాణీకులు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+