తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 11 వరకు ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు..!!
రైల్వే ప్రయాణీకలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు ప్రకటన చేసారు.విజయవాడ డివిజన్ పరిదిలోని నిడుదవోలు - కడియం మధ్య ఆదునీకరణ పనుల కారణంగా ఈ నెల23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. దీంతో..ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. రద్దైన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు.
ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్ర వరం - విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ - రాజమహేంద్రవరం( 07467) ప్యాసింజర్, గుంటూరు - విశాఖ (17239)సింహాద్రి, విశాఖ గుంటూరు స(17240) సింహాద్రి, విజయవాడ -విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, విశాఖ - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు - విశాఖ (22702) ఉదయం ఎక్స్ ప్రెస్, విశాఖ - గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ తిరుపతి (22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదే విధంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం - విశాఖ (17219), విశాఖ - మచిలీపట్నం (17220) ఎక్స్ ప్రెస్ లు, గుంటూరు - రాయగడ (17243), విశాఖ - లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. వీటితో పాటుగా ఈ నెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ - గుంటూరు (17244), లింగంపల్లి -విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్ లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి ఆగస్లు 9 వరకు తిరుపతి - విశాఖ (22708) డబల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దయింది. దీంతో..విశాఖ కు రాకపోకలు సాగించే ప్రయాణీకులకు సమస్యలు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications