ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్ - రిజర్వేషన్ టికెట్ బదిలీ, ఇలా..!!
రైల్వే ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా రిజర్వేషన్ టికెట్ మరొకరికి బదిలీకి వెసులుబాబు కల్పిస్తూ నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలను విడుదల చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం, డబ్బు కూడా వృధా అవుతుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రిజర్వేషన్‌ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది.
చివరి నిమిషంలో ప్రయాణం రద్దు ద్వారా రిజర్వేషన్ ఛార్జీతో పాటుగా టికెట్ ధరలో కొంత మొత్తాన్ని ప్రయాణీకుడు నష్టపోవాల్సి వస్తోంది. దీంతో, తీసుకొస్తున్న కొత్త నిర్ణయాల్లో భాగంగా ఈ టికెట్ బదిలీ అవకాశాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణానికి 24 గంటల ముందు రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా రిజర్వేషన్ బదిలీ చేసుకోవచ్చు. ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలా చేస్తేనే మరొకరి పేరిట టికెట్ బదిలీ అవుతుంది. ఉద్యోగులైతే పండుగలు, పెండ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎన్‌సీసీ క్యాడెట్లకూ ఇది వర్తిస్తుంది.

రిజర్వేషన్ టిక్కెట్ బదిలీ కోసం ప్రక్రియ దశలవారీగా ఉంటుంది. టికెట్‌ను తన పేరిట బదిలీ చేయించుకునే ప్రయాణిలు వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఐడీకార్డు సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ బదిలీ ప్రక్రియ దశలవారీగా ఉంటుంది. టికెట్ ప్రింట్ అవుట్ తీసుకొని సమీప రైల్వేస్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీకార్డ్ వంటి ఐడీతోపాటు టికెట్ బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి ఐడీ కాపీ తప్పనిసరిగా ఉండాలి. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో టికెట్ రిజర్వ్ చేసుకొనే వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీని ద్వారా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకొనే వారికి వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications