తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రెండు వందేభారత్ రైళ్లు - ముహూర్తం, రూట్లు ఫిక్స్..!!

తెలుగు రాష్ట్రాల్లో ఒకే ముహుర్తాన రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న రెండు వందేభారత్ కు పెరుగుతున్న ఆదరణతో రైల్వే అధికారులు మరో రెండు రైళ్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించారు. విజయవాడ - చెన్నై, కాచిగూడ - యశ్వంతపూర్ మధ్య ఈ రెండు నూతన వందేభారత్ సర్వీసుల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెండు వందేభారత్ రైళ్లు : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనుంది. విజయవాడ - చెన్నై-విజయవాడ, కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ రైలు ప్రయాణించే మార్గం..సమయవేళలు..స్టాపులు ..టికెట్ ధరలు ఖరారయ్యాయి. ఈ నెల 15న ప్రధాని ఈ రైలును వర్చ్యువల్ గా ప్రారంభించేందుకు దాదాపు ముహూర్తం ఫైనల్ అయింది.

vandebharathexpress

నిత్యం రద్దీగా ఉండే విజయవాడ - చెన్నై మార్గంలో వందేభారత్ ప్రతిపాదనకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విజయవాడ -చెన్నై మధ్య 431 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం తమిళనాడు ఎక్స్ ప్రెస్ 5 గంటల 45 నిమిషాల్లో గమ్యం చేరుకుంటోంది. వందేభారత్ 5 గంటల్లోనే విజయవాడ నుంచి చెన్నై చేరుకొనే విధంగా టైమింగ్స్ ఖరారు చేసారు.

ముహూర్తం - రూట్ ఖరారు : అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఉదయం 8 గంటలకు విజయవాడలో బయల్దేరి, మధ్నాహ్నం 1 గంటకు చెన్నై చేరుకోనుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో మధ్నాహ్నం 3 గంటలక చెన్నైలో బయల్దేరి రాత్రి 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మార్గంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

ఒక్కో స్టేషన్ లో రెండు నిమిషాలు వందేభారత్ ఆగనుంది. మరో రైలు కాచిగూడ నుంచి యశ్వంతపూర్ రైలు నంద్యాల జిల్లా డోన్ మీదుగా రాకపోకలు సాగించనుంది. హైదరాబాద్ - బెంగళూరు రెండు ఐటీ సిటీల మధ్య రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 గంటల వరకు సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 7 గంటల్లో గమ్యస్థానం చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

vandebharathexpess1

తగ్గనున్న ప్రయాణ సమయం : మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకొనేలా కాచిగూడ - యశ్వంతపూర్ వందేభారత్ రూట్ ఖరారు చేసారు. విజయవాడ - చెన్నై వందేభారత్ వయా రేణిగుంట మీదుగా నడవనుంది ఈ రెండు రైళ్లు తొలిగా ఎనిమిది కోచ్ లతో ప్రారంభం కానున్నాయి. రెండు రైళ్లల్లోనూ ఒక ఎగ్జిక్యూటివ్, ఏడు ఏసీ ఛైర్ కార్ లతో నిర్వహించనున్నారు.

కాచిగూడ - యశ్వంతపూర్ రైలును సికింద్రాబాద్ డివిజన్, విజయవాడ - చెన్నై రైలును చైన్న డివిజన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ రెండు రైళ్లకు సంబంధించి ట్రయిల్ రన్ పూర్తయింది. కోచ్ లు సంబంధిత డివిజన్లలోనూ లోకో డిపోలకు చేరాయి. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ఈ రెండు రైళ్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+