పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఫిక్స్..!!
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి వందేభారత్ స్లీపర్ సర్వీసు విశాఖ కేంద్రంగా ప్రారంభం కానుంది. విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ ఖరారు చేసారు. ముందుగా విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ ఏర్పాటు పై నిర్ణయం జరిగింది. అయితే, ఇప్పుడు ఆ స్థానంలో విశాఖ నుంచి స్లీపర్ నడపాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు రూట్ తో పాటుగా స్టేషన్లు.. టైమింగ్స్ ఫిక్స్ అయ్యాయి.
వందేభారత్ స్లీపర్ రైళ్లు వరుసగా పట్టాలెక్కుతున్నాయి. తొలి విడతలో తొమ్మిది రైళ్లు పలు రాష్ట్రాలకు కేటాయింపు పైన తుది కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతికి ఒక రైలు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, విజయవాడ నుంచి అయోధ్య, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయి. వీటిల్లో ముందుగా విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ ఖరారైంది. విజయ దశమి వేళ ఈ సర్వీసును ప్రారంభించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఏదైనా ఆలస్యం జరిగితే దీపావళి కి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ ప్రతిపాదన స్థాయిలో ఉంది.

స్టేషన్లు - టైమింగ్స్ ఫిక్స్
ప్రస్తుతం ఏపీ నుంచి బెంగళూరు మార్గంలో వెళ్లే ప్రధాన రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుత విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే సాధారణ రైళ్లలో ప్రయాణానికి దాదాపు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.ఈ కొత్త స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 14 గంటల వ్యవధిలోనే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ రైలు వారానికి 6 రోజులు (సోమవారం మినహా) నడిచేలా ప్రతిపాదించారు. విశాఖపట్నం లో రాత్రి 08:15 గంటలకు బయలుదేరి.. రాత్రి 8.45 కు దువ్వాడ, కృష్ణాకెనాల్ కు అర్ధరాత్రి 01:05 గంటలకు చేరి.. తెల్లవారుజామున 04:40 గంటలకు నంద్యాల, 7.30 కి ధర్మవరం, 10 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అదే విధంగా బెంగళూరులో తిరిగి రాత్రి 08:00 గంటలకు బయలుదేరి.. రాత్రి 10.30కి ధర్మవరం, అర్ద్రరాత్రి 01.02 గంటలకు నంద్యాల, 04.55 కి కృష్ణాకెనాల్, 09.15 కి దువ్వాడ మీదుగా 10 గంటలకు విశాఖ చేరే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు.












Click it and Unblock the Notifications
