తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు - ఇక నుంచి..!!

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే నాలుగు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేస్తూ రైల్వే అధికారులు ప్రకటించారు.అక్టోబర్ 18 నుంచి ఈ రైళ్ల వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. రైల్వే అధికారులు ప్రకటించిన వాటిలో సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. ఈ నాలుగు రైళ్లకు సంబంధించిన కొత్త మార్పులు..సమాయాలను రైల్వే అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్ - గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ ప్రెస్ (12710) ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుతుంది. సవరించిన ప్రయాణ వేళల ప్రకారం రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ లో ప్రారంభమైఉదయం 8.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.ఈ రైలు విజయవాడకు వేకువజామున 4.30కి బదులుగా 3.35కి చేరుతుంది.

Railways made changes Four Express trains timings details here

సికింద్రాబాద్ - తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ (12764) ప్రయాణ వేళలు గూడూరు స్టేషన్ నుంచి మారనున్నాయి. గూడూరుకు తెల్లవారు జామున 4.43కి బదులుగా 4.19కి చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్ కు ఉదయం 7.15కి బదులుగా 6.55కి చేరుకుంటుంది. ప్రయాణ సమయం నాలుగు నిమిషాలు పెరగనుంది.

లింగంపల్లి -తిరుపతి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ (12734) సాయంత్రం 6.25కి బదులుగా సాయంత్రం 5.30కి బయల్దేరనుంది. తిరుపతికి ఉదయం 7గంటలకు బదులుగా 5.55 గంటకలు చేరుకుంటుంది. ప్రయాణ సమయం12.35 గంటల నుంచి 12.25 గంటలకు తగ్గనుంది.

ఏపీలోని నర్సాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాగర్ సోల్ కి వెళ్లే నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ (17231) ప్రస్తుతం రాత్రి 11.15కి బయల్దేరిఉదయం 9.45 కి చేరుకుంటుండగా..కొత్త సమయం ప్రకారం రాత్రి 9.50కి బయల్దేరి ఉదయం 7.30 కి చేరుకుంటుంది. దీంతో ప్రయాణ సమయం 10.30 గంటల నుంచి 9.40కి తగ్గనుంది. ఈ మర్పులు అక్టోబర్ 18వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+