తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ప్రయాణీకులకు లేటెస్ట్ అప్డేట్..!!

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందే భారత్ రైళ్ల ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న రెండు వందేభారత్ కు ఆదరణ ఉండటంతో కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు..ట్రయిల్ రన్ కూడా పూర్తి చేసారు. ఈ సమయంలోనే రైల్వే శాఖ కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. కొన్ని మార్గాల్లోనే వందేభారత్ పరిమితం కాకుండా విస్తరించే దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కొత్త సర్వీసులు వాయిదా: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రెండు వందేభారత్ పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరో రెండు వందేభారత్ రైళ్లకు ఆమోదం లభించింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌, విజయవాడ - చెన్నై వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Railways planning to launch Mini Vandebharat Trains in Telugu states soon

ఇదే సమయంలో విశాఖ - భువనేశ్వర్ మినీ వందేభారత్ ప్రారంభించేందుకు రైల్వే అధికారులు ట్రయిల్ రన్ పూర్తి చేసి అధికారులకు రిపోర్టు ఇచ్చారు. కానీ, కొత్త వందేభారత్ రైళ్ల ప్రారంభం పై రైల్వే శాఖ కొత్త ఆలోచన ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రారంభించాలనే కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా కొత్త షెడ్యూల్ సిద్దం చేస్తోంది.

రెండు రైళ్లకు తాత్కాలకి బ్రేక్: కేంద్రం తాజా ఆలోచనలతో కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ సర్వీసుకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. వాస్తవానికి ఈ రైలు గత నెల 31నే చెన్నై నుంచి కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంది. రేపు (ఆగస్టు 15) న ఈ రైలు ప్రారంభించేలా తొలుత షెడ్యూల్ ఖరారు చేసారు. అదే విధంగా చెన్నై- విజయవాడ ప్రారంభం కూడా వాయిదా వేసారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లు 30లోపు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సంఖ్యను వీలైనంత తొందరలో వందకు చేర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా వాటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసకున్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ మహబూబ్ నగర్, డోన్ మీదుగా ట్రయిల్ రన్ పూర్తి చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

Railways planning to launch Mini Vandebharat Trains in Telugu states soon

మినీ వందేభారత్ రైళ్లపై కసరత్తు: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, వందేభారత్‌ రైళ్లను కూడా ప్రధాన ఆకర్షణగా జనం ముందు నిలపాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో భారత్‌లో వంద వందేభారత్‌ రైళ్లను పట్టాలెక్కించాలని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్యను వీలైనంత తొందరలోనే ప్రయాణికుల సేవలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది.

ఇందుకోసం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొన్నింటిని ఆపి, మరికొన్నింటిని జతచేసి ఒకేసారి ప్రారంభించాలని భావిస్తున్నారు. దీంతో, పట్టాలెక్కాల్సిన కాచిగూడ-యశ్వంతపూర్‌ వందేభారత్‌ కూడా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు 8 కోచ్‌ల మినీ వందేభారత్‌ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్పత్తి పెరిగే కొద్దీ వాటికి అదనపు కోచ్‌లను జత చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+