నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్ .. తిరుపతి ఇక కొత్తగా..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్ - విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ (నంబరు 20677/20678) రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 12 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. అదే సమయంలో శ్రీవారి భక్తుల కోసం తిరుపతికి వెళ్లే వందే భారత్ రైళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో, సుదీర్ఘ నిరీక్షణ తరువాత విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నై వరకు నడుస్తున్న వందేభారత్ కు నర్సాపురం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 12న ఈ రైలును ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే, తాజాగా ఆ ముహూర్తం జనవరి 15వ తేదీకి మారింది. సంక్రాంతి వేళ ఈ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరే వందే భారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10కి చేరుతోంది. పొడిగించిన సర్వీసు 11.45 గంటలకు విజయవాడకు చేరుకొని, అక్కడి నుంచి 11.50కి బయల్దేరి మధ్యాహ్నం 12.25కు గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం చేరుతుంది.

ఇక, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయలుదేరి 3.20కి భీమవరం, 4.10కి గుడివాడ, 4.50కి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి 4.55 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.20కి తెనాలి, 6.30కి ఒంగోలు, రాత్రి 7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50కు రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఇక.. సికింద్రాబాద్ - తిరుపతి సహా 7 మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సికింద్రాబాద్- తిరుపతి, మంగళూరు సెంట్రల్- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్, దేవ్‌గఢ్-వారణాసి, హవ్‌డా-రౌర్కెలా, ఇందౌర్-నాగ్‌పుర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లలో మరికొన్ని కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications