తిరుపతి, చెన్నై వందేభారత్ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ - ఇక నుంచి..!!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. మరిన్ని సర్వీసుల పెంపు కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న రూట్లలో రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు కోచ్ ల సంఖ్య పెంచారు. ఇక, విజయవాడ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కు అమోదం లభించించినా.. సాంకేతిక కారణాలతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి చెన్నై వేళ్ల వందేభారత్ రైళ్ల విషయంలో కొత్త ప్రతిపాదనలు రైల్వే మంత్రి నుంచి అధికారులకు చేరాయి.

వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతో, ప్రజా ప్రతినిధులు సైతం రైల్వే శాఖ పైన తమ ప్రాంతాల్లో వందేభారత్ సేవల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్ రైళ్లకు మరో రెండు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని బాపట్ల ఎంపీ దుర్గా ప్రసాద్ నేరుగా రైల్వే మంత్రిని రెండు సార్లు కోరారు. ఇప్పుడు ఈ విషయంలో కదలిక వచ్చింది. 2 రైల్వే స్టేషన్లలో రైలును నిలపడానికి దోహదపడే సాధ్యాసాధ్యాలపై నివేదికను ఇవ్వాలని అధికారులను రైల్వే మంత్రి ఆదేశించారు. కాగా, అధికారులు సైతం స్థానికంగా తీసుకున్న సమాచారం మేరకు హాల్టింగ్ అవసరం ఉందని చెబుతున్నారు. ఇదే సమాచారం రైల్వే శాఖకు ఇవ్వనుండటంతో త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Railways seed report on increasing stoppages for Vandebharat in Bapatla route

రోజూ 2 వందే భారత్‌ రైళ్లు బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్ల మీదుగా వెళ్తున్నప్పటికీ అక్కడ ఆగడం లేదు. సికింద్రాబాద్‌- తిరుపతి, విజయవాడ-చెన్నై మధ్య వందే భారత్‌ రైళ్లు వారంలో 6 రోజులు తిరుగుతున్నాయి. చెన్నైకి 5 గంటలు, హైదరాబాద్‌కు నాలుగున్నర గంటలు, తిరుపతికి మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. దీంతో, ఈ రెండు రైళ్లకు బాగా డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఎక్కడా వీటికి హాల్టింగ్‌ లేదు.

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అదనపు బోగీ పెంచి అయినా వందేభారత్‌ రైళ్లకు జిల్లాలోని 2 పట్టణాల్లో హాల్టింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని చబుతున్నారు. అయితే, బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లు కేవలం 18 కి.మీ. దూరంలోనే ఉన్నాయనీ, రెండు చోట్ల రైలును ఆపడానికి సాంకేతిక అవరోధాలు వస్తాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. దీంతో.. ఓ రైలును బాపట్లలో, మరో రైలును చీరాలలో ఆపే విధంగా నిర్ణయం వెలువడనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+