ఏపీ నుంచి చెన్నై వైపు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు- బుకింగ్ ఓపెన్
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.
తాజాగా నర్సాపూర్ నుంచి ట్యుటికోరిన్ (తూత్తుకుడి) ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు సెప్టెంబర్ 7వ తేదీన పట్టాలెక్కనుంది. 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన హాల్ట్ స్టేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.

- సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు.. మూడో రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12: 20 నిమిషాలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
- సెప్టెంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో ప్రతి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది.
ట్యుటిమేలూర్, కోవిల్ పట్టి, సత్తూర్, విరుధునగర్, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.













Click it and Unblock the Notifications