తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు- హాల్ట్ స్టేషన్లు

వివిధ స్టేషన్ల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. ఈ క్రమంలో గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రత్యేక రైలును ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి- చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైలును రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణికుల తాకిడిని అధికంగా ఉండటంతో అధికారులు ఈ ప్రత్యేక రైలును నడిపిస్తోన్నారు.

Railways to run Special Trains from Tirupati to Charlapalli to clear Extra Passenger Rush On July 26

తిరుపతిలో ఈ నెల 26వ తేదీన పట్టాలెక్కుతుంది. ఇది సింగిల్ ట్రిప్ ఎక్స్ ప్రెస్. తిరుపతి నుంచి చర్లపల్లికి వెళ్లి మళ్లీ తిరిగి రావడంతో దీని ప్రయాణం ముగుస్తుంది. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడుతుంది.

ఈ నెల 26వ తేదీన గురువారం రాత్రి 8 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07417 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:15 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07418 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఏసీ- 2 టయర్, ఏసీ- 3 టయర్, స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలు ఈ ఎక్స్ ప్రెస్ కు అందుబాటులో ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఆరంభం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+