ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన...ఐఎండీ అలర్ట్..
ఆంధ్రప్రదేశ్ వాసులకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. మార్చినెల మొదలు కాక మునుపు నుంచే రెండు తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతవారణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది.
ఏపీలోని ఉత్తరకోస్తాలో నేడు రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆదివారం మరాఠ్వాడా నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఉత్తర కేరళం వరకు ఉండి కొనసాగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో గల ద్రోణి ప్రస్తుతం పశ్చిమ విర్భ నుంచి మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర కేరళం వరకు ఉండి కొనసాగుతుంది. దక్షిణ ఒడిశా నుంచి ఉప హిమాయలన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఇప్పుడు క్రమంగా బలహీనపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ/నైరుతి దిశలో గాలులు వీస్తున్నట్లు ఐఎండీ చెబుతోంది.
రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం..
ఈ ద్రోణి ప్రభావం కారణంగానే ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ జల్లులు ఇవాళ, రేపు కూడా పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఉత్తరకోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాలోని పలు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications