• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత (ఫోటోలు)

By Nageswara Rao
|

అమరావతి: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరుసగా నాలుగోరోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.

స్వర్ణముఖి నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చంద్రగిరి నియోజవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా గోడకూలి ఒకరు మృతి చెందగా, విద్యుదాఘాతంలో మరొకరు మృతి చెందారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా భారీవర్షాలు కురవడంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమను అతలాకుతలమైంది. ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలను ముంచెత్తిన తుపాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై మాత్రం పెను ప్రభావాన్ని చూపింది.

గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నెల్లూరు సిటీతో పాటు జిల్లా మొత్తం నీట మునిగింది. అంతేకాదు కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారి కోతలకు గురైంది. రహదారిపై ఏర్పడ్డ భారీ గోతుల కారణంగా మూడు రోజుల పాటు రెండు నగరాల మధ్య దాదాపుగా రాకపోకలు స్తంభించాయి.

బుధవారం సాయంత్రానికి వర్షాలు తగ్గుముఖ పట్టడంతో ఏపీ రవాణా శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ చార్జీ మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాలో వరద సహాయక కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం భాగస్వాములు అవుతున్నారు.

మంత్రి శిద్ధా రాఘవరావు మూడురోజులుగా అక్కడే ఉండి స హాయక చర్యలు పర్యవేక్షిస్తుండగా పలువురు డిప్యూటీ కలెక్టర్లు స్థాయి అధికారులు ప్రత్యక్షంగా పాల్గొంటుండగా, మరికొందరు పరోక్షంగా పనిచేస్తున్నారు. మనుబోలు వద్ద పడిన భారీగండి పూడ్చే పనులను శిద్ధా పర్యవేక్షిస్తున్నారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

భారీవర్షాల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి తక్షణం వెయ్యి కోట్ల రూపాయలు సాయం చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. వరద ప్రభావానికి మూడు వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంలో వర్ష బీభత్సంపై ఆయన ప్రధానికి లేఖ రాశారు. అలాగే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్‌లకు నష్టాలపై నివేదికలను పంపించారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడమే గాక, చెరువులు, కుంటలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలోని 95 కేంద్రాల్లో 200 మిల్లీమీటర్ల నుండి 657 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నెల్లూరు జిల్లా దారుణంగా దెబ్బతిన్నాదని, చిత్తూరు, కడప జిల్లాలు కూడా అతలాకుతలం అయ్యాయని వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని , అనంతపురం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా నష్టపోయారని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో 35 మంది చనిపోయారని, 613 మూగజీవులు మృతి చెందాయని ముఖ్యమంత్రి తెలిపారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

467 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, 2029 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని , రెండు లక్షల హెక్టార్లకు పైగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 550 సాగునీటి వనరులు నాశనమయ్యాయని చెప్పారు. 1860 కిలోమీటర్లు మేర రహదారి వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని సిఎం వివరించారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

గూడూరు దగ్గరలోని మనుబోలు గ్రామంలో 100 మీటర్లకు పైగా జాతీయ రహదారి తెగిందని, నెల్లూరు, చెన్నై మధ్య రాకపోకలు స్తంభించాయని వివరించారు.188 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, 26,206 మందికి ఆహార, వసతి సదుపాయాలు కల్పించామని చెప్పారు. దెబ్బతిన్న జాతీయ రహదారి పునరుద్ధరణ పనులు గురువారం రాత్రికి పూర్తవుతాయని వివరించారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

ఎన్డీఆర్‌ఎఫ్ చెబుతున్న నిబంధనలకు మించి రాష్ట్రప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించిందని, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున పరిహారం అందించామని సిఎం వివరించారు. అలాగే 20 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో చక్కెర అందించామని అన్నారు. జరిగిన నష్టం విలువ 3వేల కోట్లకు పైగానే ఉందని పూర్తి సమగ్ర నివేదికను తొందర్లోనే కేంద్రానికి పంపుతామని సిఎం పేర్కొన్నారు.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

చిత్తూరు, నెల్లూరు, చెన్నైల్లో రెండు రోజులు శాంతించిన వాన గురువారం సాయంత్రానికి మళ్లీ మొదలైంది. ఈ ప్రాంతాల్లో ఉదయం చిరు జల్లులుగా మొదలైన వాన.. మధ్యాహ్నం.. రాత్రికి బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా తిరుపతి, కాళహస్తి, చెన్నై శివారు, ప్రాంతాల్లో కుండపోతలా కురిసింది.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నెల్లూరులోనూ సరాసరి అయిదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ వరద ఇంకా ఇంకలేదు. ఈ జిల్లాలో శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. చెన్నైలోనూ అంతే. ఇక్కడ పలు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఇంకలేదు. ఇక్కడా మళ్లీ వర్షం మొదలైంది. మరో రెండు రోజుల పాటు ఇక్కడ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

చిత్తూరు జిల్లాలో గురువారం కురిసిన వర్షం వల్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మారుమూల గ్రామాలకు రహదారులు కొట్టుకుపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది. రేణిగుంట, పుత్తూరు, ఏర్పేడు, తిరుపతి, శ్రీకాళహస్తిలు అతలాకుతలమయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాళహస్తి నుంచి చంద్రగిరి వరకూ స్వర్ణముఖి నది ప్రవాహం ప్రమాదకరంగా మారింది.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

దీంతో శ్రీకాళహస్తి-సత్యవేడు రోడ్డు మార్గం మూసేశారు. జిల్లాలో పలుచెరువులకు గండ్లుపడ్డాయి. ఇక్కడి జలాశయాల్లో అదనపు నీటిని కిందకు వదిలారు. దీంతో తిరుపతి నగరంలోని నవోదయ కాలనీ, రైల్వే కాలనీ, యశోదనగర్‌, ఆటోనగర్‌తో ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి.

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

తిరుపతి- గూడూరు- నెల్లూరు మార్గం కొట్టుకుపోవడంతో తిరుపతి- ఏర్పేడు- రాపూరు- పొదలకూరు మీదుగా విజయవాడకు బస్సులు నడుపుతున్నారు. రైళ్ల రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ రేణిగుంట - కడప, రేణిగుంట -గూడూరుల మధ్య రాకపోకలు సాగిస్తున్న రైళ్లు మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

 నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నెల్లూరు జిల్లాలో గురువారం కూడా పలు పల్లెలు జలదిగ్బంధంలోనే కొనసాగాయి. వర్షాలు.. వరద ఉద్థృతి కాస్త తగ్గినా.. వరద నీరు తగ్గ లేదు. నెల్లూరులో మన్సూర్‌నగర్‌, పరమేశ్వరి నగర్‌, ఖుద్దూస్‌నగర్‌, కొండదిబ్బ, ఇరుగాలమ్మ సంగం ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి వేలాది మందిని గురువారం పునరావాస కేంద్రాలకు తరలించారు.

 నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

నడిరోడ్డుపై కుర్చీలో మంత్రి శిద్ధా: 24 గంటల్లో వరద గోతుల పూడ్చివేత

జిల్లాలో 53.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. గూడూరు పట్టణంలోనూ ఇంకా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారికి మూడు ప్రాంతాల్లో పడిన గండ్లు పూడ్చేందుకు చర్యలు సాగుతున్నాయి. శుక్రవారం నుంచి చెన్నై, తిరుపతి వైపు వాహనాల రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. 60 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆ గ్రామస్థులకు హెలికాప్టర్‌ ద్వారా, బోట్ల ద్వారా ఆహార పొట్లాలు అందించారు.

గురువారం ఉదయమే రంగంలోకి దిగిన ఆయన నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. మంత్రి ఆదేశాలతో మొన్న రాత్రి నుంచే అధికార యంత్రాంగం జాతీయ రహదారిపైకి వచ్చేసింది. గండిని పూడ్చేందుకు అవసరమైన రాళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రకాశం జిల్లాలో నుంచి తరలిస్తున్నారు.

సాయంత్రంలోగానే జాతీయ రహదారిపై ఏర్పడ్డ గోతులన్నీ కనుమరుగయ్యాయి. అందుబాటులో ఉన్న వాహనాలు, కూలీలను రంగంలోకి దించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన రహదారిపై పడిన గోతులను పూడ్చివేయించారు. గురువారం సాయంత్రానికి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పున:ప్రారంభం కావడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. వాహనాల రాకపోకలు ప్రారంభమైన తర్వాత కాని మంత్రి అక్కడి నుంచి కదలలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore, Chitoor and Kadapa bore the brunt of the rain that wreaked havoc in the three districts, killing 13 people and causing damage to crops and roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more