విజయ్ కోసం త్రిష ఆ స్టార్ హీరోయిన్‌తో గొడవ పడిందని తెలుసా..?
త్రిష.. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా అందంతో హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
కాగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్ లో నటించనుంది. అయితే త్రిష వ్యక్తిగత జీవితం తరచూ వివాదాల్లో నిలుస్తోంది.

ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాగా విజయ్ - సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని జోరుగా చర్చ నడుస్తోంది. కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుకకు కలిసి హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు Vijay ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభావాన్ని గట్టిగా చూపిస్తున్నారు. ఆయన స్థాపించిన Tamilaga Vettri Kazhagam (TVK) పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌లలో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగిన రాజకీయ పోరుకు ఈ ఫలితాలు కొత్త మలుపు తిప్పినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ కోసం త్రిష మరో స్టార్ హీరోయిన్ అసిన్‌తో గొడవపడ్డారనే పాత కథ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
త్రిష, అసిన్ దాదాపు ఒకే సమయంలో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్టార్ హీరోలతో వరుసగా హిట్లు కొట్టడంతో వారి మధ్య పోటీ ఉందనే ప్రచారం బలపడింది. విజయ్‌తో 'తిరుప్పాచ్చి'లో త్రిష, 'శివకాశీ'లో అసిన్ నటించగా ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత విజయ్‌తో పాటు అసిన్ 'పోకిరి', 'కావలన్' చిత్రాల్లో కనిపించడంతో త్రిష ఆమెతో గొడవపడ్డారని సమాచారం. ఆ వివాదం తర్వాత ఇద్దరు నటీమణులు పెద్దగా మాట్లాడుకోవడం మానేశారని అంటుంటారు. అయితే ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. ఏ హీరోయిన్ తోనూ తనకు గొడవలు జరగలేదని వెల్లడించారు.












Click it and Unblock the Notifications