Andhra Pradesh: ఏపీకి తీవ్ర హెచ్చరిక
రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో ఉంది. ఇది ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అనుకున్నదానికంటే మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వీటి ఉపసంహరణలో జాప్యంవల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందంటున్నారు.
ఉపరితల ద్రోణి: అల్పపీడనం ఏర్పడిన ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే మరికొన్ని రోజులు కొనసాగనుండటంతో సెప్టెంబరులో సాధారణం లేదంటే అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
విజయవాడలో: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 68.7 మిల్లీ మీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా 51.8, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 47.8, పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరులో 39.2, కృష్ణా జిల్లా గుడివాడలో 35.2, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 33, ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీ 30, పార్వతీపురంలో 28.4, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 26.2, ఏలూరు జిల్లా నూజివీడులో 22.8, కైకలూరులో 21.6, ఏలూరు జిల్లా పోలవరంలో 18.4, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 16.2, ఏలూరు జిల్లా భీమడోలులో 16.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 15.4, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలసలో 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications