ఏపీ టు బెంగళూరు కొత్త వందేభారత్ - రూట్ ఫిక్స్..!!
ఏపీకి మరో వందేభారత్ అందుబాటులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. తాజా బడ్జెట్ లో ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ఈ సారి ప్రాధాన్యత పెరిగింది. అమరావతి రైల్వే స్టేషన్ పైనా హామీ లభించింది. ఇదే సమయంలో ఏపీ నుంచి కొత్తగా వందేభారత్ సర్వీసు పైన పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఏపీ మంత్రుల ప్రతిపాదన పైన స్పందించిన మంత్రి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్ త్వరలో పట్టాలెక్కనుంది.
మరో వందేభారత్
లోక్ సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ డెవలప్ మెంట్ గురించి కోరగా..ఆ స్టేషన్ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు మంత్రి సమాధానం ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల సమస్యలు ఉన్నాయని..త్వరలోనే పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. విజయవాడ -ముంబాయి మధ్య దూరం ఎక్కవ కావటంతో వందేభారత్ సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేసారు.

విజయవాడ - బెంగళూరు
ఇదే సమయంలో బెంగళూరు - విజయవాడ మధ్య వందేభారత్ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో పనులు వేగంగా జరుగుతున్నాయని...త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ కు వందేభారత్ అందుబాటులో ఉంది. ఏపీ నుంచి నేరుగా బెంగళూరుకు వందేభారత్ కేటాయించాని ఎంపీలు రైల్వే మంత్రిని కోరారు. విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నైకు ప్రతీ రోజు వందేభారత్ నడుపుతున్నారు.
రైల్వే శాఖ కసరత్తు
సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇక..విజయవాడ - చెన్నై మద్య నడుస్తున్న వందేభారత్ కు వస్తున్న స్పందనతో కొత్తగా విజయవాడ - బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అదే విధంగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లలోనూ తొలి ప్రాధాన్యతలో సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications