సొంత మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన వైసీపీ అభ్యర్థి
ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడునున్నాయి. ఈక్రమంలో పార్టీల అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మ్యానిఫెస్టో కోసం సామాన్య ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఎంతో అతృతుగా ఎదురు చూశారు.ఇదే సమయంలో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల జాప్యం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
గత ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. ఈసారి అంతకు మించి సంక్షేమం ఉంటుందని అంతా భావించారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా అమలు చేస్తోన్న నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని మాత్రమే జగన్ ప్రకటించారు. గత మ్యానిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి.. చిన్న చిన్న మార్పులతో కొత్త మ్యానిఫెస్టోను ప్రకటించారు.తాజాగా వైసీపీ అభ్యర్థి తన నియోజకవర్గానికి సంబంధించి సొంత మ్యానిఫెస్టోను విడుదల చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ సొంత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఆయన గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

గోదావరిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం తన సంకల్పమని భరత్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ హబ్ గా రాజమండ్రిని తీర్చిదిద్దడం, రెండు మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకురావడం, జగనన్న కాలనీలలో 40 వేల మందికి ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు..అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ , రాజన్న రచ్చబండ కార్యక్రమాలు , వారం వారం అధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజాసమస్యలు పరిష్కరిస్తారని భరత్ పేర్కొన్నారు.సిటి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై ప్రజలకు సేవలు అందిస్తానని రాజమండ్రిని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తానని భరత్ ప్రకటించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications