10 రన్స్ రావు: కిరణ్ 'చివరి బంతి'కి రాజయ్య కౌంటర్

సిడబ్ల్యూసి నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా అందుకు అతీతుడు కాదని చెప్పారు. విభజనపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించేలా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడటం సరికాదని రాజయ్య ఈ సందర్భంగా అన్నారు.
ఢిల్లీకి చేరుకున్న సీమాంధ్ర ఉద్యోగులు
సమైక్యాంధ్ర పరిరక్షణ ప్రయత్నంలో భాగంగా బుధవారం ఢిల్లీకి బయలుదేరిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు గురువారం ఉదయం దేశ రాజధానికి చేరుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ రోజు సాయంత్రం వారు ఎపి భవన్ నుండి ఇండియా గేట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.
లగడపాటి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర ఎంపీలు గురువారం ఉదయం సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని ఈ సమావేశంలో ఎంపీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్పీకర్ మీరాకుమార్ ఆమోదింకపోతే రాజీనామాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలని ఎంపీలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications