అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పనికిరాకుంటే తీసేస్తా: బాబు కీలక వ్యాఖ్యలు, రాజధానిలో పర్యటించిన రాజమౌళి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ శాఖ ఏం పని చేస్తుందే, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ శాఖ ఏం పని చేస్తుందే, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

అదొక్కటే కాదు, మరో కోణం: పవన్ కళ్యాణ్‌పై మోడీ ఆగ్రహం వెనుక, అవసరమే కానీఅదొక్కటే కాదు, మరో కోణం: పవన్ కళ్యాణ్‌పై మోడీ ఆగ్రహం వెనుక, అవసరమే కానీ

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త శాఖల ఏర్పాటు అవసరమని చెప్పారు. కొన్ని శాఖలు ఏం పని చేస్తున్నాయో, ఎందుకు ఉన్నాయో తెలియదన్నారు.

అనవసర శాఖలు తొలిస్తాం

అనవసర శాఖలు తొలిస్తాం

ఉపయోగం లేని శాఖలను తొలగిస్తామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శాఖలు మార్చడం అవసరమని చెప్పారు. అవసరం దృష్ట్యా అవసరమైన శాఖలను సృష్టించడం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా కొత్త శాఖలను సృష్టించాలన్నారు. తన పాలనలో 58 శాతం మంది సంతృప్తితో ఉన్నారన్నారు.

చంద్రబాబుతో రాజమౌళి మరోసారి భేటీ

చంద్రబాబుతో రాజమౌళి మరోసారి భేటీ

రాజధాని డిజైన్లపై సీఎం చంద్రబాబుతో దర్శకులు రాజమౌళి బుధవారం రెండోసారి భేటీ అయ్యారు. ఉదయం భేటీ తర్వాత మధ్యాహ్నం కూడా ఆయన చంద్రబాబును కలిశారు. రెండోసారి నిర్వహించిన సమావేశం ముగిసింది. అంతకుముందు రాజధాని ప్రాంతంలో రాజమౌళి పర్యటించారు.

రాజధాని ప్రాంతంలో పర్యటన

రాజధాని ప్రాంతంలో పర్యటన

అమరావతి పర్యటన అనంతరం ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. సాయంత్రం మరోసారి సమావేశం కానున్నారు. రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణానికి సంబంధించి డిజైన్ల సహకారాన్ని కోరిన నేపథ్యంలో అమరావతికి ఈ ఉదయం చేరుకున్న రాజమౌళిస తొలుత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం అమరావతిలో పర్యటించారు.

లండన్ పర్యటన ఖరారు కాలేదు

లండన్ పర్యటన ఖరారు కాలేదు

ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో రాజమౌళి పర్యటించారని మంత్రి నారాయణ వెల్లడించారు. ఐకానిక్‌ భవనాలు నిర్మించే ప్రాంతాన్ని రాజమౌళి సందర్శించారన్నారు. తాత్కాలిక సచివాలయం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారన్నారు. సాయంత్రం 6.30లకు సీఎంతో మరోసారి భేటీ అవుతారన్నారు. ఆయన లండన్‌ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు.

English summary
Tollywood director SS Rajamouli on Wednesday morning met Chief Minister Chandrababu Naidu at the Secretariat in Amaravati where they held discussions on the building designs of Assembly and High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X