కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కొత్త జిల్లాల రగడ.. రాజీనామాలకు సిద్ధమంటున్న వైసీపీ నేతలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఉగాది నాటికి ప్రక్రియను పూర్తి చేసేందుకు చకచకా కసరత్తు చేస్తోంది. అయితే కొత్త జిల్లాల పేర్లు, కేంద్రాల ఏర్పాటుపై పలు చోట్ల విమర్శలు వస్తున్నాయి. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కానీ, ఇక్కడ ప్రతిపక్షాల కంటే.. అధికార వైసీపీ నేతలే ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అది కూడా సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలోనే ఈ వివాదానికి బీజం పడింది.

 రాజంపేటకు అన్నమయ్య జిల్లాగా నామకరణం

రాజంపేటకు అన్నమయ్య జిల్లాగా నామకరణం

రాష్ట్ర ప్రభుత్వం రాజంపేట నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఈ కొత్త జిల్లాకు అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసింది. అయితే దీనికి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. రాజం పేట ప్రజలను సంప్రదించకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిని రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవితో పాటు పలవువురు వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.

 జిల్లా కేంద్రంగా రాజంపేటనే ఉండాలి

జిల్లా కేంద్రంగా రాజంపేటనే ఉండాలి

ప్రభుత్వ ఏకపక్షనిర్ణయంతో తాము ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు మర్ర రవి. అసలు అన్నమయ్య పేరును ఆయన పుట్టిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి ఎలా పెట్టారని మండిపడ్డారు. అవసరమైతే రాయచోటిని మదనపల్లిలో కలుపుకొని మరో జిల్లా ఏర్పాటు చేసుకోవాలన్నారు . రాజంపేట ప్రజలను అనాథల్లా రాయచోటిలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ణయంతో రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదన్నారు.

. వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తా..

. వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తా..

ప్రభుత్వ నిర్ణయం ఇలాగే ఉంటే తన వైస్ ఛైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని మర్రి రవి హెచ్చరించారు. రాజంపేటను కడప జిల్లాలో కొనసాగించాలని కోరారు. లేదంటే రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

టీడీపీ నేతల ఆందోళన

టీడీపీ నేతల ఆందోళన


మరోవైపు టీడీపీ నేతలు కూడా జిల్లా కేంద్రంపై ఆందోళనకు దిగారు కొత్తబోయినపల్లెలోని అన్నమయ్య విగ్రహం వద్ద నిరసనకుదిగారు. అన్నమయ్య నడిచిన నేల రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ తమ పదవులుకు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు..

English summary
YCP Leaders Serious on Rayachoti choosed as headquarter than Rajampeta-Annamayya District
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X