షాకింగ్ రిపోర్ట్!: ఇల్లీగల్ విగ్రహాల్లో వైయస్‌వే టాప్ లిస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రహదారుల్లో ఇల్లీగల్ విగ్రహాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు టాప్ లిస్ట్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలోని పలు కూడళ్లలో పలు విగ్రహాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందులో వైయస్ విగ్రహాలదే టాప్ లిస్ట్ అని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఏపీ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్టుమెంట్ విగ్రహాల పైన సర్వే చేసి ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది.

విశాఖ జిల్లాలోని విశాఖ, పాడేరు రెవెన్యూ డివిజన్లలో దాదాపు 50 విగ్రహాలు అక్రమంగా ఉండగా.. అందులో 57 వైయస్ విగ్రహాలేనని సమాచారం. పలు విగ్రహాలు రోడ్లను, ఫుట్ పాత్‌లను, డివైడర్లను ఆక్రమిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. చాలా విగ్రహాలకు అసలు అనుమతులే తీసుకోలేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివంగత వైయస్ విగ్రహాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications