ఏపీ మంత్రి రోజా వర్సస్ రజనీ అభిమానులు..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ వర్సస్ వైఎస్సార్సీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చేసిన కామెంట్స్ తో రజనీ కాంత్ లక్ష్యంగా వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మంత్రులు రోజా కూడా రజనీ పైన సీరియస్ గా స్పందించారు. ఇప్పుడు తమిళనాడు మంత్రి రోజా పర్యటన సమయంలో మరోసారి ఈ వివాదం పై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ సమయంలో మంత్రి రోజా స్పందన పైన తలైవా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత నెలలో విజయవాడ కేంద్రంగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో పాటుగా చంద్రబాబు పైన ప్రశంసలు గుప్పించారు. దీని పైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రజనీ పైన మంత్రులు...వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల గురించి మాట్లాడవద్దని తన అనుభవం చెబుతుందని అంటూనే చంద్రబాబు గురించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు నచ్చలేదు. 1995 లో టీడీపీలో జరిగని వెన్నుపోటు ఎపిసోడ్ ను ప్రస్తావించారు. ఆ సమయంలో రజనీ పాత్ర నుంచి ఎన్టీఆర్ శతజయంతి సభ వరకు చోటు చేసుకున్న పరిణామాల పైన స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

 rojarajinikanth-

అదే సమయంలో మంత్రి రోజా కూడా రజనీకాంత్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పైన అప్పట్లోనే రజనీ ఫ్యాన్స్ సీరియస్ గా స్పందించారు. గతంలో రజనీకాంత్ కాళ్ల రోజా మొక్కిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు తాజాగా మంత్రి రోజా తిరుచెందూర్ మురుగ‌న్ ఆల‌యానికి వెళ్లారు. ఆ సమయంలో ఈ వివాదం పైన అక్కడి మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా మంత్రి రోజా స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఏపీలో జరిగే ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయం సాధిస్తుందన్నారు. జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేసారు. రాజకీయంగా వ్యాఖ్యలు ఎలా ఉన్నా రజనీకాంత్ గురించి ప్రశ్నించిన సమయంలో స్పందించిన తీరు పైన ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో, ఈ వివాదం కొత్త టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+