బాలకృష్ణ, రజనీకాంత్, శివరాజ్ కుమార్ కాంబినేషన్ లో మల్టీస్టారర్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్..ఈ ముగ్గురూ కలిసి త్వరలోనే ఓ మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారు. KGF తరహాలో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు.
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ జోరందుకుంది. ఒకప్పుడు మల్టి స్టారర్ చిత్రాలు చేసేందుకు టాలీవుడ్ అగ్రహీరోలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కథ బాగుంటే కలిసి నటించడానికి సై అంటున్నారు. మల్టీ స్టారర్ చిత్రాలు గతంలో బాలీవుడ్ కే పరిమితమయ్యేవి. RRR మూవీతో దక్షిణ భారత చలనచిత్ర రంగంలో కూడా ఊపందుకున్నాయి.

RRR కంటే ముందుగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2 లాంటి మల్టీ స్టారర్ చిత్రాలు టాలీవుడ్ లో వచ్చాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటించగా, బీమ్లా నాయక్ లో పవన్, రానా కలిసి నటించి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం బ్రో కూడా మల్టీ స్టారరే. ఇటీవలే విడుదలైన ఘనవిజయం సాధించిన వాల్తేరు వీరయ్య లో చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించారు.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ సలార్ లో నటిస్తున్నారు. ఈ క్రాస్ ఓవర్ స్టార్ సినిమాల ట్రెండ్ ని టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ మరో ఎత్తుకు తీసుకెళ్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో కలిసి బాలకృష్ణ మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో.. శివరాజ్ కుమార్ తో కలిసి ఓ చిత్రం చేయబోతున్నట్లు బాలకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications