గంటకుపైగా వేచిచూసి 15ని.ల్లోనే: రాజ్‌నాథ్‌తో భేటీపై సుజనా షాకింగ్, అందుకే బాబు నిరసన

Recommended Video

    Rajnath Singh Meets TDP MPs And Saves TDP-BJP Alliance

    న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, తక్షణం రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎంపీలకు హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి పెద్దగా అభయం రాలేదని తెలుస్తోంది. వారు సోమవారం ఆయనతో భేటీ అయిన విషయం తెలిసిందే.

    ముందస్తు అపాయింటుమెంట్ల కారణంగా ఆయనను కలిసేందుకు టిడిపి ఎంపీలు దాదాపు గంటకు పైగా వేచి చూశారు. ఆ తర్వాత కేవలం 15 నిమిషాలలో ఆయనతో భేటీ ముగిసింది. ఆ సమయంలోనే వారు ఏపీకి రావాల్సిన హామీల గోడును వెళ్లబోసుకున్నారు. రాజ్‌ను కలిసిన వారిలో అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, తోట నర్సింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.

    ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు

    ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు

    కేంద్రంపై టీడీపీ తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఆదివారం సీఎం చంద్రబాబుతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సోమవారం టీడీపీ ఎంపీలను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆరా తీశారు.

    అందుకే చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు

    అందుకే చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు

    అందుకు టీడీపీ ఎంపీలు స్పందిస్తూ.. ప్రతి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి భారీగా నిధులిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ, చివరి బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి కనిపించడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని చెప్పారు. రాజకీయంగా ఇది రెండు మిత్ర పక్షాలకు మంచిది కాదన్నారు. అందుకే చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టి తీవ్రనిరసన వ్యక్తం చేశారని తెలిపారు.

    రాజ్‌నాథ్‌తో 15 నిమిషాల్లో ముగిసిన భేటీ

    రాజ్‌నాథ్‌తో 15 నిమిషాల్లో ముగిసిన భేటీ

    అంతకుముందు రాజ్‌నాథ్ ముందస్తు సమావేశాల్లో ఉండటంతో టీడీపీ ఎంపీలు సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. అయితే, సమావేశం 15 నిమిషాల్లోనే ముగిసింది. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి ఇకపై ఎటువంటి జాప్యం లేకుండా హోంమంత్రిత్వశాఖ తరఫున తమవంతు చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ పూర్తిస్థాయిలో హామీ రాలేదని కూడా తెలుస్తోంది.

     మోడీని మళ్లీ కలవమని చెప్పండి

    మోడీని మళ్లీ కలవమని చెప్పండి

    మీ బాధను నేను అర్థం చేసుకోగలనని రాజ్‌నాథ్ టీడీపీ ఎంపీలతో అన్నారు. నిధుల అంశంపై ఇప్పటికే చంద్రబాబు గతనెల 12న ప్రధాని మోడీని కలిసిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయనను కలిసి ఇది వరకు అడిగిన వివరణలు అందించాలని సూచించారు. వీలైతే ఆ సమావేశానికి తానూ వస్తానన్నారు.మీరు కొంచెం ఓపిక పట్టాలని అంటే, ఇంకా ఎంత కాలం ఓపిక పట్టాలని టీడీపీ నేతలు అన్నారని తెలుస్తోంది.

     ఆశించిన స్పందన లేదు

    ఆశించిన స్పందన లేదు

    రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ.. సమవేశంలో పెద్దగా చర్చలేమీ జరగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో పార్లమెంటు బయట, లోపల నిరసనను కొనసాగించాలని నిర్ణయించామన్నారు. త్వరలో ప్రధాని మోడీని కలుస్తామని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+