సాయిరెడ్డికి చేదు అనుభవం-రాజ్యసభలో బాబు పురాణం-అడ్డుకున్న వైస్ ఛైర్మన్..!
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ రాజ్యసభలో చేదు అనుభవం తప్పలేదు. రాజ్యసభలో రెండు రోజుల పాటు జరగాల్సిన రాజ్యాంగంపై చర్చ ఇవాళ ప్రారంభమైంది. ఇందులో వైసీపీ తరఫున మాట్లాడే అవకాశం రావడంతో విజయసాయిరెడ్డి సీట్లోంచి లేచారు. అనంతరం లోక్ సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలతో ప్రారంభించి చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన్ను రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పదే పదే అడ్డుకున్నారు.
ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, లోక్ సభలో టీడీపీ జూనియర్ ఎంపీ ఒకరు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై 86 వేల కోట్లు వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించారని సాయిరెడ్డి ఆరోపించారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన ఈ నిధులు మళ్లించార్నారు. ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. ఇందులో వాస్తవమెంతో తేల్చాలని కోరారు. ఆర్టికల్ 46 ప్రకారం రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోందని, కానీ ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ ఏపీలో అదే చేస్తుందన్నారు.

రాష్ట్రంలో వెనుక బడిన వర్గాల కోసం గతంలో తాము ఈ మొత్తం ఖర్చుపెట్టిన్నట్లు సాయరెడ్డి గుర్తుచేశారు. తాము ఎస్సీల కోసం సూపర్ 9 తెచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం తెచ్చిన అన్ని పథకాలను టీడీపీ పక్కనబెట్టేసిందన్నారు. చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ ఉల్లంఘన అని టీడీపీ చెబుతోందని, కానీ ఆయన్ను జైలుకు పంపింది కోర్టు అని తాము కాదని తెలిపారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మ్యానిఫెస్టో అమలు చేయకపోవడం, తాము అమలు చేసిన పథకాలు పక్కనబెట్టేయడం, టీడీపీ, ఎన్డీయేపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని అరెస్టులు చేయడం, అసలు
మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడవటమే రాజ్యాంగ విరుద్దమన్నారు. దీంతో ఆయన్ను ప్రసంగం ఆపాల్సిందిగా పదే పదే కోరిన రాజ్యసభ వైస్ ఛైర్మన్ .. ఆయన మాటల్ని రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications