చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్తం మరిగిన రాబందులు: జల్లికట్టుపై రాంగోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు

సినీ పరిశ్రమ అంతా ఒక్క తాటి పైకి వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలుపుతుంటే వర్మ మాత్రం జల్లికట్టు కోసం నిరసన తెలుపుతున్న ఆందోళన కారులు, వారికి మద్దతు తెలుపుతున్న సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా కొనసాగుతున్న జల్లికట్టు వివాదంపై అందరికి భిన్నంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సినీ పరిశ్రమ అంతా ఒక్క తాటి పైకి వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలుపుతుంటే వర్మ మాత్రం జల్లికట్టు కోసం నిరసన తెలుపుతున్న ఆందోళన కారులు, వారికి మద్దతు తెలుపుతున్న సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఘాటుగానే స్పందించిన వర్మ..

ఘాటుగానే స్పందించిన వర్మ..

రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి...
‘అమాయకమైన జంతువులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అని పేరు పెట్టుకొని తప్పించుకోలేరు. ప్రభుత్వం సినిమాల్లో కాకులను, కుక్కలను చూపించడం కూడా నేరమని, సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని సమర్థిస్తోంది. ఆ ఎద్దులు చెవులు, కొమ్ములు విరిగిపోయి, తోక ఎముకలు తొలగి, ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణించటం అనాగరికం' అని ఆయన పేర్కొన్నారు.

జంతువును హింసించడం హక్కా?

జంతువును హింసించడం హక్కా?

‘జల్లికట్టును సమర్ధిస్తున్న ప్రతి ఒక్కరి మీదకు 100 ఎద్దులను వదలి ఆ తరువాత వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారు అనాగరికులు, అందుకే ఓ జంతువును హింసించే హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే అమాయక ప్రజలను హింసించే అల్ ఖైదా కూడా కరెక్టే' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

టెర్రరిజం కన్నా ఘోరం..

టెర్రరిజం కన్నా ఘోరం..

అంతేగాక, ‘రక్షణ లేని జంతువులను సాంప్రదాయం పేరుతో ఆనందం కోసం హింసించటం టెర్రరిజం కన్నా ఘోరం. అలా ఒక మూగజీవాన్ని వేటాడం కన్నా ఓ మనిషి ఎందుకు వేటాడరు. జల్లికట్టుకోసం పోరాడుతున్న వారికి కనీసం సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. వారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అలా అయితే మద్దతు తెలిపేవారు కాదేమో..

అలా అయితే మద్దతు తెలిపేవారు కాదేమో..

‘ఆ జంతువులకు ఓటు హక్కు ఉండి ఉన్నా.. థియేటర్ కు వెళ్లి టికెట్ కొనుక్కునే అవకాశం ఉన్నా.. ఏ ఒక్క రాజకీయ నేత, సినీ నటుడు కూడా జల్లికట్టుకు సపోర్ట్ చేసేవాడు కాదు' అంటూ తన ఆవేదనను చాటుకున్నారు. జయలలిత హాయం నుంచి ఇప్పటి శశికళ హయాం వరకు ఈ దురాచారం కొనసాగుతూనే ఉందని వర్మ మండిపడ్డారు.

English summary
The Kollywood industry has come to a standstill protesting the Supreme Court ban on Jallikattu with several stars like Rajinikanth, Ajith, Suriya, Kamal Haasan, Dhanush and other stars expressing their opposition to the ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X