Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బుడమేరు గండ్ల పూడ్చివేత వేళ బిగ్ అలర్ట్..!!

విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు ఇంకా టెన్షన్ పెంచుతున్నాయి. బుడమేరు వరద కొనసాగుతోంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో ప్రభుత్వం సైన్యం సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగిస్తోంది. అక్కడే మకాం వేసిన మంత్రి రామానాయుడు ఈ సాయంత్రానికి పూడ్చివేత పనులు పూర్తవుతాయని వెల్లడించారు.

గండ్లు పూడ్చివేత
బుడమేరు ప్రవాహం పైన ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతించినట్లు కనిపిస్తున్నా...పూర్తిగా ముప్పు తొలిగిపోలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇంకా 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం... ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి. విజయవాడ నగరంలో శుక్రవారం రెండు అడుగుల మేర వరద నీరు పెరగటంతో స్థానికులు మరోసారి ఆందోళన చెందారు.

Ramanaidu says Budameru breach fixing work is likely to be completed by evening

సైన్యం సహకారం
విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మూడు గండ్లు పడటంతో వాటిని పూడ్చేందుకు నాలుగు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది. మంత్రి రామానాయుడు అక్కడే మకాం వేసారు. బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు.


.
నేటితో పనుల పూర్తి
గండ్లు పూడ్చివేత కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది అధికారులు, ఆర్మీ జవాన్లు వచ్చారు. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్‌ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తున్నారు. మూడో గండి పూడ్చివేత ద్వారా బుడమేరు ముంపు సమస్య ప్రస్తుతానికి పరిష్కారం అయినట్లేనని యంత్రాంగం భావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+