అనుష్కకు ట్వీట్ చేసిన రామ్ చరణ్

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి.' ఇటీవల విడుదలైన ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది. నవీన్‌ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా.. అనుష్క చెఫ్‌గా తన డైలాగులతో అలరిస్తోంది. ఈ టీజర్‌పై ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు. దీనికి నవీన్ పొలిశెట్టి ఇచ్చిన రిప్లై కూడా ఆకట్టుకుంటోంది.

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌ చూశానని, కొత్తగా ఉందని, బాగుందని, మూవీ టీం అందరికీ నా అభినందనలంటూ రామ్ చరణ్ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ కు నవీన్‌ పొలిశెట్టి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మీ ట్వీట్‌ చూసి మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్‌ వేస్తున్నామని, సినిమాల ఎంపికలో మీ నిర్ణయాలతో 'గేమ్‌ ఛేంజర్‌' అనిపించుకున్నారని, ఇలాంటి విషయాల్లో మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థ్యాంక్యూ రామ్‌ చరణ్' అని నవీన్ ట్వీట్ చేశారు. అనుష్క కూడా రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది. ఉపాసనతో కలిసి సినిమా చూడాలని కోరింది.

ramcharan tweet on anushka latest movie

ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్‌ కూడా ఈ టీజర్‌ను ప్రశంసించాడు. ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉందని.. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పాడు. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలకు సిద్ధమవుతోంది. అనుష్క చాలారోజుల తర్వాత ఈ సినిమాతో స్క్రీన్ పై కనపడబోతోంది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి-2 అనుష్క కేవలం రెండు సినిమాల్లోనే కనిపించింది. ఒకటి భాగమతికాగా రెండోది నిశ్శబ్దం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+