"పవన్ కల్యాణ్! ఆ ఫోర్స్ ఏమైంది, ఆ డబ్బులేం చేశావ్, సీమ గోడు పట్టదా?"
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బిజెపి అనుబంధ సంస్థ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్. రమేష్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన బిజెపి ఎదుగదలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కియా మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో టిడిపి నాయకులు రైతుల భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు రాయలసీమ ప్రయోజనాలు పట్టడం లేదని అన్నారు.

జెఎఫ్‌సి నేతలు ఔట్ డేటెడ్
కర్ణాటక, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్ల తెలుగువారు అధికంగా ఉ్న చోట్ల తమ పార్టీని నష్టపరిచేందుకు కుట్ర జరుగుతోందని రమేష్ నాయుడు అన్నారు. కర్ణాటకలో పవన్ కల్యాణ్ ప్రచార చేస్తారనే వార్తలు వస్తున్నాయని ఆనయ గుర్తు చేశారు. జనసేన పార్టీలో, జెఎఫ్‌సిలో ట్ డేటెడ్ నేతలు, స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. జెఎఫ్‌సి నివేదిక కోసం నిర్వహించిన సమావేశం ఫార్స్ అని వ్యాఖ్యానంచారు.

ఆ పోర్స్ ఏమైంది..
గతంలో పవన్ కల్యాణ్ కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదికను ఏర్పాటు చేసి కటి రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారని రమేష్ నాయుడు గుర్తు చేస్తూ ఆ ఫోర్స్ ఏమైందని, ఆ డబ్బు ఏం చేశారని, రాయలసీమల హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ వైఖరి ఏమిటని, సీమ గోడు పవన్‌కు పట్టదా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రైతుల నుంచి భారీ కొనుగోళ్లు...
పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లో రైతుల నుంచి టిడిపి నేతలు భారీగా భూములు కొనుగోలు చేస్తున్నారని రమేష్ నాయుడు ఆరోపంచారు. కియా మోటార్స్ ప్రాంతంలో పల్లె రఘునాథ రెడ్డి, పయ్యావుల కేశవ్ భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపంచించారు.

మా వద్ద ఆధారాలున్నాయి...
కియా మోటార్స్ ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రమేష్ నాయుడు ఆరోపించారు. దాదాపు రెండు వందల కోట్ల విలువైన భూములు లాక్కున్నారని అన్నారు. దీనిపై తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. రైతులను భయపెట్టి 275 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి, భూములను రైతులకు ఇప్పించాలని అన్నారు.












Click it and Unblock the Notifications