రంగారెడ్డిలో హైడ్రామా: తెరాస ఖాతాలోకి వరంగల్

కాంగ్రెస్, టిడిపి ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు ప్రతిపాదనలను ఇరు పార్టీ మధ్య చెర్చలు జరుగుతున్నాయి. జెడ్పీ పీఠాన్ని చెరో రెండేళ్లు పంచుకోవాలనేది మొదటి ప్రతిపాదన కాగా, మహబూబ్‌నగర్, వరంగల్ జెడ్పీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు, టిడిపి సహకరిస్తే, అందుకు ప్రతిఫలంగా రంగారెడ్డి జెడ్పీ పీఠం టిడిపికి దక్కేలా కాంగ్రెస్ సహకరించాలనేది రెండో ప్రతిపాదనగా తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలపై చర్చలు కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెసు, టిడిపి జడ్పిటీసిలు గైర్హాజరయ్యారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది.
ఇదిలావుంటే, వరంగల్ జడ్పీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఖాతాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 50 జడ్పీటిసి స్థానాలు ఉండగా, కాంగ్రెసు 24 స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి ఆరు స్థానాలున్నాయి. టిడిపి మద్దతుతో జడ్పీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలని కాంగ్రెసు భావించింది.
అయితే, కాంగ్రెసుకు వ్యతిరేకంగా పరిస్థితి మారిపోయింది. 18 జడ్పిటీసి స్థానాలు గెలుచుకున్న తెరాస చైర్మన్ పదవిని కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది మంది కాంగ్రెసు జడ్పిటీసీలు, నలుగురు టిడిపి జడ్పీటీసిలు తెరాసకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీంతో వరంగల్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications