నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరులో సైకో వీరంగం: మహిళపై రేప్, వృద్దురాలిపై దాడి

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డాడు. ఓ మహిళపై దాడి చేసి అత్యాచారం చేశారు. మరో వృద్దురాలిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకొనేందుకు స్థానికులు ప్రయత్నిస్తే బెదిరించి పారిపోయాడు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

నెల్లూరు జిల్లా కోవూరులో గురువారం రాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకు సైకో వీరంగం సృష్టించారు. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డాడు. నాయి బ్రహ్మణ వీధిలో దుండగుడు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు.

Rape on a Woman in Nellore district

ఈ వీధిలో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అరిస్తే ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత మరో వీధిలోకి వెళ్ళి ఓ వృద్దురాలిపై నిందితుడు దాడి చేశాడు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయారు.

ఈ దాడుల విషయాన్ని తెలుసుకొన్న స్థానికులు నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. అయితే వారి నుండి నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన నిందితుడు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.

English summary
A unknown person was raped on a woman at Kovvur town in Nellore district on Thursday late night.police searching for accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X