Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిందితుల రిమాండ్, బెదిరించి నగ్న ఫోటోలు తీశారు..

హైదరాబాద్: పెద్ద అంబర్ పేట పరిధిలో బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరించిన ఇద్దరు నిందితులు యువతి పైన అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డిలపై నిర్భయ చట్టం కింద నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

కాగా, కేసు వివరాలను వనస్థలిపురం ఏసీపీ భాస్కర్ గురువారం మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన ప్రేమికులు సోమవారం పెద్ద అంబర్‌పేట్ నుండి సంఘీ దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆగారన్నారు. అక్కడ వారు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని చెప్పారు.

జంట సన్నిహితంగా ఉన్న దృశ్యాలను దొంగచాటుగా చిత్రీకరించారు. మీ విషయాన్ని కుటుంబసభ్యులకు, పోలీసులకు చెబుతామని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. అతని పైన దాడి చేశారు. దీంతో ప్రియుడు అక్కడ నుంచి భయంతో పారిపోయాడు.

Rapists called victim girl again and demanded sex

అదే అదనుగా భావించిన నిందితులు ఆ యువతిని భయపెట్టి నగ్నంగా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి, అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సెల్‌ఫోన్‌తో వారి ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ చేసుకుని నెంబర్‌ నోట్‌ చేసుకున్నారు. మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని లేకుంటే నగ్న చిత్రాలు నెట్‌లో లోడ్‌ చేస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు. నిందితులు మరుసటి రోజు ఆ యువతికి ఫోన్‌ చేసి అదే ప్రాంతానికి రమ్మని బెదిరించారు.

దీంతో ఫిర్యాదుకు మొదట భయపడ్డ బాధితురాలు ఆ తర్వాత హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫోన్‌ నెంబరు ఆధారంగా నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందినవాడు. లింగారెడ్డి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ మండలం పెద్దవేడు గ్రామానికి చెందినవాడు. కొంతకాలంగా వీరు పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. నిందితుల నుండి రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+