గతంలో సస్సెండ్ చేసింది వీరినే: తీర్పుని చదివి వినిపించిన మంత్రి రావెల

హైదరాబాద్: శాసనసభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు న్యాయవ్వవస్థ పరిధిలోకి రావని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. రోజాను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించకపోవడంపై ఆయన శుక్రవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

శాసనసభను రోజా కించరపరిచారని మండిపడ్డారు. అసెంబ్లీ రూల్ 340 ప్రకారం ఒక సభ్యుడిని, సభ్యురాలిని సస్సెండ్ చేసే అధికారం స్పీకర్‌కు ఉందని అన్నారు. శాసనసభలో జరిగే తీర్మానాలు, చట్టాలు న్యాయవ్వవస్థ పరిధిలోకి రావని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రోజా ప్రవర్తన సరిగా లేదని అన్నారు.

Ravela kishore babu on roja suspension issue

రోజా బహిరంగ క్షమాపణ చెబితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. శాసనసభలో మంత్రులపై రోజా దుర్భాషలాడని అన్నారు. సభలో ఓ దళిత ఎమ్మెల్యే అనిత పట్ల రోజా ప్రవర్తించిన తీరు దురదృష్టకరమని అన్నారు. ఆమె ప్రవర్తనను యావత్ ప్రపంచం మక్తకంఠంతో ఖండించిందన్నారు.

చట్టాలు, రాజ్యాంగం, కోర్టు తీర్పులకు మేం లోబడతామని, మాకు న్యాయ వ్యవస్థలంటే చాలా నమ్మకం ఉందని చెప్పారు. ఈ దేశ సమగ్రత కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం మేం ఎప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు. గతేడాది డిసెంబర్ 12న అసెంబ్లీలో రోజా తీరుపై తామేమీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అన్నారు.

శాసనసభకు సభ్యులపై చర్యలు తీసుకునే హక్కు ఉందని అన్నారు. శాసనసభ, లోక్‌సభ‌ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని అన్నారు. రోజా చేసిన పెద్ద తప్పులకంటే చిన్న చిన్న తప్పులు చేసిన ఎమ్మెల్యేలను ఏళ్లపాటు సస్పెండే చేశారని అన్నారు.

ఈ సందర్భంగా గతంలో పలు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలను ఆయా అసెంబ్లీలు సస్పెండ్ చేసిన వివరాలను వెల్లడించారు. అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుకు గాను మహారాష్ట్రలో 2010లో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. 2009లో కూడా మహారాష్ట్రలో నవ నిర్మాణసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని తెలిపారు.

తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారని, 2015లో హర్యానాలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆరు నెలలు పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. రోజా ప్రవర్తనపై నిజానికి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని, అయితే ఆమె ప్రవర్తన మార్చుకుంటుందనే ఉద్దేశంతో చూశామన్నారు.

రోజా ప్రవర్తనను అందరూ ఖండించాలని అన్నారు. రోజా ప్రవర్తన తీరుపై ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగపై మాకు విశ్వాసం ఉందని, ఆమె ప్రవర్తనను అందరూ ఖండించాలని అన్నారు. కాగా సభకు అన్ని అధికారులు ఉన్నాయని రావెల చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలారు.

అంతేకాదు దీనికి సమాధానం చెప్పకుండానే మంత్రి దాటవేశారు. దళిత యాంగిల్ లోనే మాట్లాడాలంటూ మరో ఎమ్మెల్యే యామనిబాలకు రావెల సూచించారు. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే దళిత యాంగిల్ ను వినిపించాలని రావెల పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై మీడియా అడిగిన ఏ ప్రశ్నకు ఆయన బదులివ్వలేక నీళ్లు నమిలారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+