వైఎస్ జగన్ పెద్ద మనసు - మదనపల్లి పర్యటనలో అనూహ్య ఘటన
రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించారు. విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేశారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి నాలుగో విడత కింద 684 కోట్ల రూపాయలను ఆయన నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలుగుతోంది.
జగనన్న విద్యాదీవెన కింద 9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 3,349 కోట్లు కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తంగా రూ.12,401 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోన్న విషయం తెలిసిందే. విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి సహకరించేలా ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేస్తోంది.

కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ వర్తింపజేసేలా వీటి విధి విధానాలకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఈ రెండింటి పథకాల ప్రయోజనం పొందడానికి అర్హలుగా గుర్తించింది. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా 10,000 రూపాయలను మంజూరు చేస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వారికి 20,000 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.
విద్యాదీవెన పథకం కార్యక్రమానికి మదనపల్లెలో హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు వెళ్తుండగా, 108 అంబులెన్స్‌కు దారిచ్చిన ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న బస్సు. pic.twitter.com/9DRcO5PTbb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 30, 2022
ఈ ఉదయం ఆయన హెలికాప్టర్‌లో మదనపల్లిలోని బీటీ కాలేజీ మైదానంలో దిగారు. అనంతరం రోడ్డు మార్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన టిప్పుసుల్తాన్ గ్రౌండ్స్‌కు వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన స్వాగతం పలికారు. మార్గమధ్యలో 108 అంబులెన్స్ ఆయన కాన్వాయ్‌కు ఎదురొచ్చింది. దీనితో తాను ప్రయాణిస్తోన్న ప్రత్యేక బస్సును రోడ్డుకు ఒకవైపున నిలిపేశారు వైఎస్ జగన్. అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. అంబులెన్స్ వెళ్లిన తరువాత తన ప్రయాణాన్ని సాగించారు.












Click it and Unblock the Notifications